Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నారాయణపేట టౌన్
మూఢ విశ్వాసాలు సమాజాభివృద్ధికి విఘాతం కల్గిస్తాయని జన విజ్జా న వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జితేందర్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరసింహ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. సమాజానికి విద్యనందించడం వల్ల అజ్ఞానం తొలగి విజ్ఞానం అభివృద్ధి చెందుతుందన్నారు. అంతరిక్షంలో అడుగు పెడుతున్న తరుణంలో బాబా లు, ఫకీర్లు, పాస్టర్లు అంటూ మోసపోవడం పనిగా మారిందన్నారు. అమాయక ప్రజలను మోసం చేయడమే కాకుండా వారి నుంచి డబ్బులు దోచుకుంటున్నారని, ఏదో ఒక సాకుతో ప్రజలను మభ్యపెడుతూ ఈ బా బాలు తమ బతుకు బండి సాగిస్తున్నారన్నారని, ప్రజలు ఈ విషయాలను గమనించాలన్నారు. మూఢవిశ్వాసాలను తొలగించేందుకు జన విజ్ఞాన వేదిక మీ మధ్యనే, మీతోనే ఉంటుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, సభ్యు లు మహిపాల్, ఇబ్రహీం, మోహన్, వెంకట్ రాములు పాల్గొన్నారు.