Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీపిస్తున్న గడువు
- జిల్లాలో పదిశాతమే పూర్తి
- నమోదులో అధికారుల నిర్లక్ష్యం
- ఆందోళనలో జిల్లా రైతులు
దేశానికి అన్నంపెట్టే రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రైతులకు అందించే కొద్దిపాటి సాయంతో పాటు బోగస్ రైతుల జాబితాను తొలగించేందుకు చేపట్టిన ఈ-కేవైసీ పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా నమోదు కోసం ప్రభుత్వం విధించిన ఈ నెల 31 వరకు గల గడువు సమీపి స్తుండడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. ఈ-వైకేసీ పట్ల అవగాహన కల్పించకపోవడం, గడువు సమీపి స్తున్నా ఇంత వరకు జిల్లాలో కేవలం పదిశాతం మాత్రమే నమోదు కావడం చూస్తుంటే రైతుల పట్ల అధికారుల చిత్తశుద్ధి ఏంటో అర్థమౌతోంది. మరో వైపు పది పరీక్షల కారణంగా జిరాక్సు కేంద్రాలను మూసేయడంతో రైతులు ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలియక సతమతమౌతున్నారు. అధికారులు స్పందించి అర్హులైన రైతలందరి పేర్లు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నవతెలంగాణ - అచ్చంపేట
నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాల పరిధిలో పీఎం కిసాన్ లబ్ధిదారులు 1,63,164 మం ది రైతులున్నారు. అయితే ఇప్పటి వరకు 15,021 మంది రైతులు మాత్రమే ఈ-కేవైసీ చేసుకున్నారు. ఇంకా 1,48,143 మంది రైతులు నమోదు చేసుకో వాల్సి ఉంది. వ్యవసాయాధికారుల అంచనా ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 10 శాతం మాత్రమే ఈ-కేవైసీ పూర్తైనట్లు చెబుతున్నారు. ఇంకా 90 శాతం మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంది. బోగస్ రైతులను జాబితాను ఏరివేసేందుకు, కేంద్రం అంది ంచే కొద్దిపాటి ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఈ- కేవైసీని ప్రవేశపెట్టారు. అందులో నమోదు చేసుకున్న రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాలో రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా డ బ్బులు జమౌతాయి. 2019లో ప్రారంభించిన ఈ పథ కంలో మూడేండ్ల పాటు 9 సార్లు రైతుల ఖాతాలో రూ.2 వేల చొప్పున డబ్బులు జమ చేశారు. అయితే ఈ పథకంలో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారనే ఉద్దేశంతో బోగస్ జాబితాను తొలగించేందుకు ఆధార్ కార్డును మొబైల్ నెంబర్‌తో ఈ నెల 31 లోపు అను సంధానం చేసుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ ఆదే శాలు జారి చేసింది. ఈ-కేవైసీ పట్ల సంబంధిత అధి కారులు రైతులకు ఎలాంటి అవగాహన కల్పించకపో వడంతో నేటికీ 90 శాతం మంది రైతులు నమోదు చేసుకోలేదు.
ఎలా నమోదు చేసుకోవాంటే
- బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన ఫోన్ నెంబ రుతో ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకో వాలి. వీటి కోసం ఆన్లైన్లో పీఎం కిసాన్ పొర్టల్ గానీ, మండల వ్యవసాయాధికారులను గానీ సంప్ర దించాలి.
- స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఈ-కేవైసీ చేసుకోవచ్చు www.pmkisan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయగా నే ఈ-కేవైసీ అప్డేట్ ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి.
- ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి, రిజిస్టర్ మొబైల్ నెం బర్ ఎంటర్ చేయాలి. వెంటనే ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
- చివర్లో సబ్మిట్ ఆప్షన్‌పైన క్లిక్ చేస్తే ఈ-కేవైసీ సక్సెస్ ఫుల్ అనే మెసేజ్ కనిపిస్తుంది.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
పీఎం కిసాన్ లబ్ధిదారులు ఈ-కేవైసీ చేసుకోవాలని గ్రామాలలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు బాధ్యతగా ఈ నెల 31 వరకు నమోదు చేసుకోవాలి.
- కృష్ణయ్య, మండల వ్యవసాయాధికారి, అచ్చంపేట