Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కృష్ణ
మండలంలోని తంగడిగి గ్రామంలో జీఓ 58 ప్రకారం ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇండ్ల స్థలాలను జిల్లా అదనపు కలెక్టర్ పద్మజారాణి, ఆర్డీఓ రామ చందర్ మంగళవారం పరిశీలించారు. గ్రామంలో గతేడాది భారీ వర్షాల కారణంగా చాలా ఇం డ్లు కూలిపోయాయి. ఈ క్రమంలో బాధితులు సర్వే నెంబర్ 66లో 125 గజాల స్థలంలో ఇండ్లు నిర్మించుకున్నారు. ఈ స్థలాలను ఉచితం గా క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అనుమతివ్వడంతో బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. తమకు వెంటనే నివాసం ఏర్పాటు చేసుకున్న భూములకు పత్రాలివ్వాలని బాధితులు అధికారులను కోరారు. వీరి వెం ట తహసీల్దార్ రామకోటి, డిప్యూటీ తహసీల్దార్ సురేష్, గిర్దావరి వెంక ట్ రాములు, రామారావు తదితరులు పాల్గొన్నారు.