Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు
నవతెలంగాణ - మహబూబ్నగర్
జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఐలాండ్, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను కలెక్టర్ మంగ ళవారం పరిశీలించి మాట్లాడారు. ఐ లాండ్ నిర్మాణ పనులు వర్షాలు వచ్చేలోపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అంతకు ముందు నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటిలోపు పూర్తవుతాయని అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట అర్బన్ తహసీల్దార్ పార్థసారధి తదితరులున్నారు.