Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొల్లాపూర్ : పురపాలక కమిషనర్ తాహసీల్దార్ పోలీసుల అండతో నిర్మించుకున్న ఇంటిని అధికారులు అక్రమంగా కూల్చి వేశారని బాధితుడు తుపాకుల వెంకటేష్ అన్నారు. మంగళవారం విలేకరులతో బాధి తుడు వెంకటేష్ మాట్లాడుతూ అయప్ప స్వామి డీపో సమీ పంలోని ఇంటిని నిర్మించు కున్నారు. 1981 సంవత్సరంలో నాటి ఎమ్మెల్యే నిరుపేదలకు 225 గజాల చొప్పున సుమారుగా రెండు వందల ఎనభై నాలుగు ప్లాట్లు వేసి నిరుపేదలకు అందిం చారన్నారు. అందులో భాగంగానే మా నాన్న గారైన సంజనకు ప్లాట్ నెంబర్ 221,, 225 గజాలు ఇచ్చారన్నారు. మళ్లీ తర్వాత 1994 -1999 సంవత్సరంలో 150 గజాల చొప్పున మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రావు ఇచ్చారన్నారు. నాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1994లో హౌసింగ్ కార్పొరేషన్ వారు మూడు వందల అరవై ఒక్క రూపాయి డబ్బులు కట్టించుకుని మీకు ఇంటిని నిర్మించి ఇస్తామని చెప్పడంతో ఎదురుచూస్తూ వచ్చామన్నారు. కొంత కాలంగా ఎదురు చూసి ఇండ్లు నిర్మించక పోవడంతో మేము ఒక ఇంటిని నిర్మించుకుని కొన్ని రోజులు ఉన్నామని కానీ అక్కడ నీటి సౌకర్యం కరెంట్ సౌకర్యం లేక పోవడంతో అక్కడి నుండి ఊరిలో వచ్చి అద్దె ఇంట్లో ఉన్న మన్నారు ఈనెల మే 12వ 2022 తేదీన కమిషనర్ తహసీల్దార్ పోలీసులతో కలిసి ఎలాంటి ముందస్తు సమాచారం నోటీసులు ఇవ్వకుండా ఉదయం 3 గంటల కు అక్రమంగా ఇల్లు కూల్చి వేశారని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి వెళ్లి అక్కడికి వచ్చిన కమిషనర్ అధి కారులకు మా దగ్గర 1981 సంవత్సరంలో ఇచ్చిన పట్టాలు ఉన్నాయని అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని వేడుకున్న విన లేదన్నారు. మున్సి పల్ కమిషనర్ కి కూల్చే దానికన్నా ముందు రోజే ఆధారాలు అందజేశానని గుర్తుచేశారు. మంగళ వారం మున్సిపల్ కమిషనర్ తో నష్టపోయిన మాకు నష్టపరిహారం ఇప్పించాలని అడిగితే నాపై కేసు వేసుకో ఏం చేసుకుంటావో చేసుకో అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ తన సిబ్బందితో బయటకు తోసి వెయ్యండి అని చెప్తూ నిర్లక్ష్యంగా దౌర్జన్యంగా సమాధానం ఇచ్చారని వాపోయారు. వెంటనే మాకు కూల్చి వేసిన ఇంటి నష్టపరిహారం అధికారుల నుండి ఇప్పించి మాతో పాటు ఒరిజినల్ పట్టాలు ఉన్న వారికి కూడా న్యాయం జరిపించి నష్టపరిహారం చెల్లించేలా చూడాలన్నారు. ఎలాంటి విచారణ చేపట్టకుండా ఇలాంటి పని చేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.