Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అచ్చంపేట : గిరిజనులు సాగుచేసుకుంటున్న ఫారెస్ట్ భూములను పట్టాలయ ఇవ్వాలని, ఫారెస్టు అధికారులు అడ్డుకుంటే సహించేదిలేదని సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్వేస్లీ హెచ్చరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తాలూకా స్థాయి సమావేశం నిర్వహి ంచారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాటా ్లడారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు తరత రాలుగా పోడు భూములను సాగు చేసుకొని జీవనం గడుపుతూ ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల భూములు లాక్కోవడం దురదృష్ట కరమన్నారు. సీఎం స్వయంగా పోడు భూముల దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తానని చెప్పిన మాట నీటి మూటగానే మిగిలిందన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని 35 వేల ఎకరాల భూమిని గిరిజనులు, గిరిజనేతరులు తరతరాలుగా ఆ భూమిని నమ్ముకుని సాగు చేసుకుని జీవనం గడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పగానే ఒక్క జిల్లాలోనే 11,500 మంది దరఖాస్తులు పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించి పట్టాలు ఇవ్వకుండా, ఫారెస్టు అధికారులచే దాడులు చేయించడం, అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు,కార్యదర్శివర్గ సభ్యులు ఎల్.దేశ్యానాయక్, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులు శంకర్ నాయక్, మల్లేష్, నిర్మల, నాయకులు లాల్అహ్మద్, ఆంజనేయులు, కష్ణయ్య, ఏం రాజు, కాశన్న, చిన్న ఆంజనేయ, బక్కయ్య, సభ్యులు ,తదితరులు పాల్గొన్నారు.