Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అచ్చంపేట : నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించాలనే ఏకైక లక్ష్యంతో కోచింగ్ కేంద్రం, నిరు ద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కోచింగ్ కేంద్రం ఉందనిప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనా్నరు. అచ్చం పేటలోని ఫంక్షన్ హాల్ నందు జిబిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోచింగ్ కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సందర్శించి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. అచ్చంపేట ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకుల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే గొప్ప లక్ష్యంతో తన బాధ్యతగా భావించి ఏర్పాటుచేసిన కోచింగ్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోచింగ్ కేంద్రం నిర్వహణపై విద్యార్థుల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలలో అచ్చంపేట ప్రాంత యువతీ యువకులు సింహభాగంలో ఉద్యోగాలు సాధించాలనే ఏకైక లక్ష్యంతో కోచింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25, 26, 27 తేదీలలో అచ్చంపేట ఎన్టీఆర్ స్టేడియం నందు యువతీ, యువకులకు వేర్వేరుగా దేహదారుడ్య పరీక్షలో రాణించే విధంగా శిక్షణ ఇస్తున్నాట్టు గుర్తు చేశారు. అందరూ సద్వినియోగం చేసు కోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సీఎంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరసింహగౌడ్, మండల రైతు సమితి అధ్యక్షులు రాజేశ్వర్రెడ్డి, మైనార్టీ సీనియర్ నాయకులు అమీనుద్దిన్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పర్వతాలు, మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ విష్ణుమూర్తి యువతీ యువకులు పాల్గొన్నారు.