Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటిక్యాల : కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ,ఉన్నతమైన ఇంగ్లీష్ విద్యను పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలు అభ్యసించడానికి ప్రభుత్వ పాఠశాలలను తీర్చిది ద్దడమే కేసీఆర్ , టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అలంపూర్ ఎమ్మెల్యే యం. అబ్రహం అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో మన ఊరు మన- బడి కార్యక్ర మంలో భాగంగా 16.74 లక్షలు, గార్లపాడు గ్రామంలో 19.1లక్షలు, పుటన్ దొడ్డి గ్రామంలో 18.91 లక్షలు, బుడ్డ రెడ్డీ పల్లె గ్రామంలో 17.26లక్షలతో శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంపొందించే ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం 'మన ఊరు-మన బడి' పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు.నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులు అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మన ఊరు మన బడి కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు. అనంతరం మున గాలగ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో పీఎసీయస్ చైర్మన్ రంగా రెడ్డి , వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండలసర్పంచుల సంఘం అధ్యక్షులు జయ చంద్రారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గిడ్డ రెడ్డి, షేక్ పల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి, మధు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.