Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగర్ కర్నూల్ , అయిజ మున్సిపాలిటిలో ప్లాస్టిక్ కవర్ల నిషేధం ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. పండ్లు, పూలు, మాంసం, కూరగాయలు, మిర్చీ బండ్ల వ్యాపారులు తక్కువ మందం కలిగిన కవర్లనే వినియోగిస్తున్నారు. చిన్న వ్యాపారం కావడంతో కవర్ల కోసం ఎక్కువగా ఖర్చు చేయలేని పరిస్థితి వారిది. పట్టణాలు, గ్రామాల్లో ఇప్పటికీ ఆ కవర్లనే వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లపై నిషేదాజ్ఞలున్నా అధికారులు పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నారు. ఎప్పుడో ఓ సారి ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న దుకాణాలపై తూతూ మంత్రంగా అధికారుల దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
-తూ తూ మంత్రంగా అధికారుల దాడులు
- దుకాణదారులపై చర్యలు నిల్
- జరిమానాల కే పరిమితమా ?
- ప్రజలకు అవగాహన కరువు
నవతెలంగాణ కందనూలు / అయిజ
నాగర్ కర్నూల్ , అయిజ మున్సిపాలిటిలో ప్లాస్టిక్ కవర్ల నిషేదిండం అధికారులు విఫలమైయ్యారు. కవర్లను ఉపయోగించకూడదని ప్రజల్లో కూడా స్వచ్ఛందంగా చైతన్యం రావాల్సి ఉంది. ఇంటి దగ్గరి నుంచే ఓ బ్యాగ్ తీసుకెళ్లడం అలవాటు చేసుకుంటే కవర్లను చాలా వరకు నిర్మూలించవచ్చని అధికారులు, పర్యావరణ పరిరక్షకులు చేప్పారు. నాగర్ కర్నూల్ జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ప్లాస్టిక్ నియంత్రణపై చర్చేలేదని తెలిపారు ప్రతిరోజు వ్యాపార దుకాణాలు, వైన్ షాపులు, ఫంక్షన్ హాల్లొ తనిఖీలు నిర్వహించాలని ప్లాస్టిక్ కలిగివున్న వారి పై జరిమానా విధించాలని ఆదేశించారు.చట్టం ప్రకారం మొదటిసారి తప్పు చేస్తే లక్ష రూపాయల జరిమానా వేయాలని, రెండవసారి దొరికితే 2 లక్షల రూపాయల జరిమనతో పాటు దుకాణం మూసివేయించడం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ ఆసు పత్రుల్లో ప్లాస్టిక్ నియంత్రణతో పాటు బయో వేస్టేజ్ ను ఏజెన్సీలకే పంపించే విధంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారిని ఆదేశించారు. కాని ఇప్పటి వరకు అమలు చేయలేదని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఆరోగ్యానికిి ఎటువంటి చెడు జరగదని. పిల్లలకు పాలు పట్టే ప్లాస్టిక్ డబ్బా తో కూడా పలు ఆరోగ్య సమస్య లు తలెత్త్ఱ్ఱే అవకాశం ఉందని కావున స్టీల్ సీసాలు వాడుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు స్కూల్ కి వినియోగించే భోజనం బాక్స్ వాటర్ బాటిల్ వీలైనంత వరకు స్టిల్ ఇత్తడి రాగి వస్తువులను వాడడం ఉత్తమమని ప్లాస్టిక్ వాడకానికి దూరం పెట్టడం మంచిదని నిపుణులు పేర్కొన్నారు
ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు.
జిల్లా కేంద్రంలో గతంలో ప్లాస్టిక్ కవర్లు వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకొనడం వాస్తవం. మార్చి బడ్జెట్ కారణంగా పాత బకాయిలు వసూలు చేయడంలో నిమగమై ఉన్నావని ఇప్పుడు వచ్చేది. వర్షాకాలం కాబట్టి వర్షాలకు రైన్ వాటర్ కాలువలు పూర్తిగా ప్లాస్టిక్ కవర్లతో నిండిపోతున్నాయి కాబట్టి ఈ వారంలో ఇబ్బందిని టీములుగా ఏర్పాటుచేసి దాడులు నిర్వహిస్తాం.
- మున్సిపల్ కమిషనర్, గోనె అన్వేష్