Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లు పి.ఉదరుకుమార్, వెంకట్రావు
- పది పరీక్షా కేంద్రాల తనిఖీ చేసిన కలెక్టర్లు, డీఈఓలు, ఇతర అధికారులు
నవతెలంగాణ - అచ్చంపేట
అధికారులు అప్రమత్తతతో, పకడ్బందీగా పరీక్షల విధులు నిర్వర్తించాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదరుకుమార్ అన్నారు. మంగళవారం ఆయన అమ్రాబాద్ మండలం దోమలపెంట, శ్రీశై లండ్యాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదో తర గతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష ల నిర్వహన తీరును పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా, నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా లేదా అనేది సీసీ కెమెరా ఫుటే జీలను పరిశీలించారు. ఈ పరీక్షా కేంద్రం సీి సెం టర్గా కొనసాగుతున్నందున ఎలాంటి లోటు పాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు నిర్వ హించాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో 43 మంది విద్యార్థుల గాను 42 మంది హాజరయ్యారని నిర్వాహకులు కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ దశరథం, డిపార్ట్మెంటల్ అధికారి అతీరామ్, కస్టోడియన్ ్ రవీందర్ తదితరులు ఉన్నారు.
కందనూలు: నాగర్‌కర్నూలు జిల్లాలో పదో తరగతి హిందీ పరీక్షకు 1,1060 మంది విద్యా ర్థులకు గాను 140 మంది విద్యార్థులు గైర్హాజరు కా గా 10920 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఈఓ గోవిందరాజులు తెలిపారు. కల్వ కుర్తి, తాడూరు, పరీక్ష కేంద్రాలను హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయలక్ష్మి , తెలకపల్లి, అచ్చంపేట పరీక్ష కేం ద్రాలను డీఈవో గోవింద రాజులు ఆకస్మికంగా సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన మౌలిక సదుపా యాలను పరిశీలించారు. జిల్లా లోని ఇతర పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బందం సభ్యులు తహసీిల్దార్లు పుష్పలత, ముజీబ్ హుస్సేన్, ఎస్.ఎం.కష్ణ, మండల విద్యా ధికారులు భాస్కర్ రెడ్డి, చంద్రుడునాయక్, శంకర్ నాయక్ పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖ ర్రావు, నోడల్ అధికారి కురుమ య్య, జిల్లా సైన్స్ అధికారి కష్ణారెడ్డి తనిఖీ చేశారని డీిఈఓ తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు
- మహబూబ్‌బ్‌నగర్ కలెెక్టర్ వెంకట్రావు
మహబూబ్‌నగర్: జిల్లాలోని పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని బేసిక్ ప్రాక్టీస్ హైస్కూల్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన హాజరైన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఉట్కూర్: మండల కేంద్రంతో పాటు, పులి మామిడి గ్రామంలోని పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి లియాకత్ అలీ తనిఖీ చేశారు.
పెద్దకొత్తపల్లి: మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ ,ఆల్ సెయింట్స్ హై స్కూల్, లిటిల్ బర్డ్స్ హై స్కూల్లోని పరీక్ష కేంద్రాలను మండల విద్యా శాఖ అధికారి చంద్రుడు తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ఎంత మంది విద్యార్థులు పరీక్షకు హాజర య్యారని చీప్ సూపరింటెండెంట్లు మద్దిలేటి, రామ స్వామి, మోహన్ ఆచారిలను అడిగి తెలుసుకు న్నారు. కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా చూడాలని సూచించారు. అనంతరం పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాల పుటేజి పరిశీలించారు.
ఉండవెల్లి: మండల పరిధిలోని మూడు పరీక్షా కేంద్రాల్లో హిందీ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు మండల విద్యాధికారి శివప్రసాద్ తెలి పారు. మైనార్టీ ఉన్నత పాఠశాలలో 169 మంది విద్యార్థులు, మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల లో 147 మంది, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 168 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. మా నవపాడు జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 292 మంది విద్యార్థులు హాజరైనట్లు చీప్ సూపరిం టెం డెంట్ బాలాజీ తెలిపారు.