Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తుల పేరుతో కాలయాపన
- 8 నెలలైనా కొలిక్కి రాని ప్రక్రియ
- ఆందోళనలో బాధిత కుటుంబాలు
- దృష్టి సారించని అధికారులు
'' నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ పరిధిలో భాస్కర్ అనే వ్యక్తి అమ్మ, అన్నా, వదినలు కరోనాతో మృతి చెందారు. ఈయన అన్నకు 18 ఏండ్లలోపు ఇద్దరు పిల్లలు న్నారు. ప్రస్తుతం వీరి బాగోగులు ఈయనే చూస్తున్నారు. కరోనా సాయం అందితే పిల్లల చదువుకు ఉపయోగపడతాయని అంటున్నారు. ''
'' మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట, హన్వాడ మండలాల్లో నలుగురు మృతి చెందారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మృతి చెందిన వారి పిల్లలు అనాథలు కావడంతో స్త్రీ శిశుసంక్షేమ శాఖ బాలవికాస కేంద్రంలో చేర్పించింది.''
కరోనాతో మృతి చెందిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని ప్రకటించాయి. ఈ సాయం ప్రకటన చేసి 8 మాసాలైనా అధికారులు దరఖాస్తుల సేకరణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇంట్లో భార్యా భర్తలిద్దరూ మృతి చెందిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. తల్లిదండ్రుల ఆలనా పాలనకు దూరమైన పిల్లలు దుర్భర జీవితం సాగిస్తున్నారు. ఈ బాధిత కుటుంబాలకు ప్రకటించిన సాయం కొంత మేరకైనా ఉపశమనం కలిగిస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న వారికి పాలకులు, అధికారుల రూపంలో నిరాశే ఎదురౌతోంది. ఈ క్రమంలో ఈ సాయాన్ని అందిస్తారా ? లేదా ? అన్న సందేహాలు విన్పిస్తున్నాయి. వీలైనంత త్వరగ సాయం అందిస్తే చేదోడు వాదోడుగా ఉంటుందని పలు బాధిత కుటుంబాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు, పాలకులు స్పందించి కరోనా సాయాన్ని బాధిత కుటుంబాలకు త్వరగా అందజేసి ఆదుకోవాలని పలు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం మొదటి, రెండో దశల్లో దాదాపు 5 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 2,500 మందికి పైగా మరణించారు. అనధికారికంగా మరో 5వేల మందికి పైగానే మృతి చెంది ఉంటారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 1.5లక్షల మంది కరోనా బారిన పడగా 450 మంది మర ణించారు. నారాయణపేట జిల్లా లో 99వేల మందికి కరోనా సోక గా 311 మృతి చెందారు. గద్వా ల జిల్లాలో 87 వేల మంది కరోనా బారిన పడగా 271 మంది మరణించారు. వనప ర్తి జిల్లాలో 93 వేల మందికి కరోనా సోకగా 311 చని పోయారు. నాగర్‌కర్నూల్‌లో 1.15లక్షల మం దికి కరోనా సోకగా 500 మంది ని వైరస్ కబళించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థి క సాయం చేసి కుటుంబాలను ఆదుకుంటామని 8 నెలల క్రితం ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఆర్థిక సహాయం కోసం గద్వాలలో 271, వనపర్తిలో 211 మం ది దరఖాస్తులు చేసుకున్నారు. మహబూబ్‌నగర్, నాగర్క ర్నూల్, నారాయణపేట జిల్లాల్లో వెయ్యికి పైగా దరఖాస్తు లు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వైద్య పరీక్షల నిర్ధా రణ ధ్రువీకరణ పత్రాలు తీసుకుని కలెక్టర్ కార్యా లయానికి పంపా రు. నెలలు గడు స్తున్నా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయ లేదు. అందు వల్ల మృతుల కుటుం బాలకు ఆర్థిక సాయంతో పాటు వారి పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించి ఉన్నత విద్యనందించేలా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
దరఖాస్తులు కలెక్టర్‌కు పంపుతున్నాం
- సుధాకర్ లాల్, జిల్లా వైద్యాధికారి, నాగర్‌కర్నూల్
కరోనా మృతుల కుటుంబాల నుంచి ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. వీటన్నిటిని ఎప్పటికప్పు డు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాము. అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందుతుంది. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకో కుంటే చేసుకోవాలి.
ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి
కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబాన్ని ఆదుకో వాలి. ఆర్థికంగా దేశంలో ముందున్నామని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధిత కుటుంబాల పట్ల వ్యవ హరిస్తున్న తీరు సరిగా లేదు. వీరికి ఆర్థిక సాయంతో పాటు పిల్లల చదువులకయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరించాలి.
- ఎ.రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్