Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ - మక్తల్
వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృద్ధికి తమవంతు కృషి చేస్తానని ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కార్యాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తన సతీమణి సుచరి తతో కలిసి బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. పాతికేండ్ల క్రితం నిర్మించిన మార్కెట్ యార్డు కార్యాలయం వర్షానికి పెచ్చులూడడంతో పాటు కార్యాలయ సిబ్బంది ఇబ్బంది పడేవారన్నారు. ఈ క్రమంలో మార్కెట్ చైర్మన్ రాజేష్ గౌడ్ కార్యాలయ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. రెండు వారాల క్రితం వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.72 లక్షలు మంజూరు చేసిం దన్నారు. అందులో భాగంగా చేపట్టే పనులు నాణ్యతగా సకాలంలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచిం చారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, టీఆర్ఎస్ పట్టణధ్యక్షులు అమరేందర్ రెడ్డి, నాయకులు మైపాల్ రెడ్డి, నేతాజీ రెడ్డి, ఈశ్వర్, కావలి తా యప్ప, శ్రీనివాస్ గుప్తా, కావలి హరి, గోవర్ధన్ రెడ్డి, మార్కెట్ కార్యదర్శి భార తి తదితరులు పాల్గొన్నారు.