Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కందనూలు
ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యునిస్టు పార్టీ (సీపీయూఎస్ఐ ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో మారోజు వీరన్న 23వ వర్దంతి సభ పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మిద్దె రాములు మాట్లాడుతూ హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 31న మారోజు 23వ వర్ధంతి సభ నిర్వహిస్తునట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి పల్లె నుండి జనం కదలాలని పిలుపు నిచ్చారు. మా వాడలో మారాజ్యం సాధనలో భాగంగ మారోజు వీరన్న వర్దంతి సభలు పల్లె పల్లె నిర్వహించాలన్నారు. అగ్రకుల పార్టీలలో ఉన్న దళిత బహుజన శ్రామికులు నాయకులురా, ఆ పార్టీలను విడిచి సీపీయూ ఎస్ఐ లో చేరాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కూరాకుల శ్రీనివాసులు, బహుజన మేధావి బండి శేఖర్, తెలంగాణ మాదిగ దండోర నాయకులు వెంకటయ్య, పీపీయూఎస్ఐ జిల్లా కమిటీ సభ్యులు మల్లేష్ , తదితరులు పాల్గొన్నారు.