Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పరుశురాం
నవతెలంగాణ- జడ్చర్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లా పేరు పెట్టాల్సిందే నని కుల వ్యవక్ష పోరాట సమితి( కేవీపీఎస్) జిల్లా అధ్యక్షుడు కావలి పరుశురాం డిమాండ్ చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేస్తూ హిం సాత్మక ఘటనలకు పాల్పడడంపై నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం కేవీపీఎస్ జడ్చర్ల మండల కమిటీ అధ్వర్యంలో జడ్చర్ల పట్టణం లోని అంబేద్కర్ విగ్రహం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పరుశురాం మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని జీర్ణించుకోలేని అగ్రకుల ఆధిపత్య శక్తులు హింసకు పాల్పడడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాలకు ఇతర నా యకులు, కులాల పేర్లు పెడితే లేని అభ్యంత రం ఇప్పుడెదుకని ప్రశ్నించారు. భారత దేశా నికి రాజ్యాంగాన్ని అందించిన భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం గర్వ కారణమని కోనసీమ ప్రజలు దానిని స్వాగ తించాలని, ఆదిపత్యా శక్తుల ఉచ్చులో పడొద్ద ని హితవు పలికారు. ప్రశాంతంగా ఉన్న కోనసీమలో అల్లర్లకు పాల్పడుతున్న సంఘ విద్రోహ శక్తులను పోలీసులు, ప్రభుత్వం అదుపు చేసి శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకురాలు లక్ష్మిదేవి, మండల నాయకులు రాము, మున్న, కష్ణ, వాసంతి పాల్గొన్నారు.
వంగూరు: మండల కేంద్రంలో కేవీప ీఎస్ ఆధ్వర్యంలో తహసీిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న మాట్లాడుతూ డా బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును వివాదాస్పదం చేస్తూ హింసాత్మక ఘటనలు జరగడం బాధకరమ న్నారు. జిల్లాల పునర్విభజన సందర్భంగా అనేక జిల్లాలకు స్వాతంత్య్ర సమరయోధులు లేదా ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టారని, కానీ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ నామకరణం చేయడంతో కొన్ని మతోన్మాద శక్తులు జీర్ణిం చుకోలేక హింసకు పాల్పడుతున్నారని ఆరో పించారు. అంబేద్కర్ అందరివాడని ఇతర జిల్లాలకు పెట్టిన పేర్లు స్వీకరించినట్లు గానే అంబేద్కర్ పేరును కూడా స్వీకరించాలని కోరారు. అమలాపురంలో శాంతి సామరస్య వాతావరణం నెలకొల్పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, నాయకులు గోపాల్, నాగరాజు, బా లరాజు, హర్ష, రాములు పాల్గొన్నారు.