Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంగమ్మదేవి విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
నవతెలంగాణ- ధరూర్
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలుగు ముదిరాజ్ కులాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గద్వాల మండ లం పరిధిలోని బీరెల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న గంగమ్మదేవి విగ్రహాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా బీరెల్లి గ్రామంలో గంగమ్మ దేవత విగ్రహ ప్రతిష్టించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ప్రభుత్వాలు ముదిరాజ్ సోదరులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వారిని ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూశాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం ఉచిత చేపపల్లిల పంపిణీ చేపల వ్యాపారం చేసేవారికి మోటార్ వాహనాలు, మత్స్యకారులకు ప్రభుత్వం తరపున ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభివద్దే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అదేవిధంగా తెలుగు ముదిరాజ్‌లను బీసీడీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలని సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కోరా రు. ఈ విషయాన్ని ప్రభు త్వం దష్టికి తీసుకువెళ్లి బీసీ ఏ లో చేర్చే విధంగా తన వంతు కషి చేస్తానని అని తెలిపారు. ఈ కార్యక్రమం లో జడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ, సర్పంచ్ జయ మ్మ, ఎంపీటీసీ సభ్యురాలు రాధమ్మ, ఆలయ కమిటీ డైరెక్టర్ శంకర్, విద్యా కమిటీ చైర్మెన్ శ్రీరాములు, టీఆర్ ఎస్ నాయకులు రమేష్ నాయుడు, నీల ఈశ్వర్ రెడ్డి, బీచుపల్లి పాల్గొన్నారు.