Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
- కంసాన్పల్లి రైతుల దీక్షకు మద్దతు
- వారికి అండగా ఉండాలని పిలుపు
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఏండ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు భూములిచ్చేవరకు పోరాడుదామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ పిలుపు నిచ్చారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండ లం కంసాన్పల్లి గ్రామ రైతులు పట్టాల కోసం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏడు రోజులుగా చేస్తున్న దీక్షలకు బుధవారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడుతూ కంసానిపల్లిలోని సర్వే నెంబర్ 229 లో గల 1024 ఎకరాల ప్రభుత్వ భూమిని దాదాపు 350 కుటుంబాలు 1000 మంది రైతులు వందల సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ బతు కుతున్నారని వారు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఏళ్ల తరబడి ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నా ఇవ్వలేని నేటి ప్రభుత్వ పెద్దలు వారు సాగు చేసు కుంటున్న భూములు కాజేసేందుకు చూస్తున్నార న్నారు. దీంతో రైతులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో, భూ పట్టా పాస్ పుస్త కాల సాధన కమిటీగా ఏర్పడి తమ భూములు కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నారన్నారు. కొండలు, గుట్టలుగా ఉన్న భూములను రాత్రనకా పగలనకా రైతులు వారి కుటుంబ సభ్యులు రక్తం చిందిం చి చదును చేసుకుని లక్షల రూపాయలు పెట్టి బోర్లు వేసుకుని పంటలు పండించుకుంటూ అక్కడే ఇండ్లు నిర్మించుకుని జీస్తున్నారన్నారు. తెలంగాణ వస్తే మన భూములు మనకే దక్కుతా యని అధికారం చేపట్టిన పాలకులు ఏండ్లుగా రైతు లు సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం పరిశ్రమల పేరుతో కార్పొరేట్ శక్తులకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తరతరా లుగా భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది, స్థానిక ఎమ్మెల్యేల బాధ్యత కాదా అని ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు గ్రామపంచాయతీ నుండి ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినపుడల్లా రాజకీయ నాయకులు ఇక్కడి రైతులకు భూ పట్టాల ఆశ చూపి ఓట్లు వేయించుకొని మోసం చేయడం ఆనవాయి తీగా మారిందన్నారు. కార్పొరేట్ శక్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ఈ రైతుల భూములు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే హుకూం జారీ చే యడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు పట్టాలు ఇస్తామని మోసం చేశారు కానీ ఈ ఎమ్మెల్యే పట్టాలిప్పిస్తానని హామీ ఇచ్చి, ఉన్న భూములకు ఎసరు పెట్టారన్నా రు. దీంతో రైతులు వారం రోజులుగా దీక్ష చేపడు తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రావ డం లేదన్నారు. రైతుల న్యాయమైన పోరాటానికి ప్రజలంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నా రు. రాజకీయ పార్టీలు ,ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు రైతులకు మద్దతిచ్చి అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి పేద రైతుల సమస్యను రాజకీయ కోణంలో చూడకుండా సాగుదారులందరికీ పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జీ.వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు యండీ గౌస్, వ్యవసా య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, ఖాజా, బాల్రెడ్డి, నరహరి, కాశప్ప, భాస్కర్, శ్రీను, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.