Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అయిజ
అయిజ పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో బుధవారం మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న ఆధ్వర్యంలో మునిసిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య 4 వ విడత పట్టణ ప్రగతిపై కౌన్సిల్ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా శానిటేషన్, కరెంట్‌స్తంభాలు, వాటర్ సప్లయి విభాగాలకు సంబం ధించిన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారన్నారు. మనం అందరం కలిసి మన వార్డు సమస్యలను మనమే పరిష్కరించుకుందామన్నారు. కమిషనర్ మాట్లాడుతూ 4 వ విడత పట్టణ కార్యక్రమాన్ని వచ్చే నెల 3 నుండి నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం అదేశాలు జారీ చేసిందన్నారు. కార్యక్రమం కోసం వార్డుకు లక్ష రూపాయల చొప్పున వెచ్చించనునుట్లు ఆయన వార్డుకు ఒక స్పెషల్ ఆఫీసర్‌ను కేటాయించి, వారిపై 5 వార్డులకు ఒక సూపర్వైజర్ ను ఏర్పాటు చేశామని, వీరిద్వారా వార్డులోని సమస్యలు పరిష్కరించుకోవాలని కౌన్సిల్ సభ్యులకు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ గోపాల్ , కౌన్సిలర్లు యస్ రాణెమ్మ శ్రీరాములు, ఆంజనేయులు , పూజారి వెంకటేష్ ,చాకలి నర్సిం హులు, ఉప్పరి చందు , శ్రీ చాకలి హుసేన్ శ్రీ రాజేష్ తెలుగు ఆంజనేయులు కౌన్సిలర్ కుమారుడు,.గజ్జి దేవరాజు మునిసిపల్ అధికారులు బి రమేష్ , లక్ష్మన్న ,వీరేందర్ , వార్డు స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.