Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోతిలాల్
- అన్ని శాఖల అధికారులతో సమీక్ష
నవతెలంగాణ - కందనూలు
పది, ఇంటర్ ఓపెన్ స్కూల్ వార్షీక పరీక్షలు ప్రణాళికా బద్దంగా నిర్వహిం చాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోతిలాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణ తీరుపై ఆయా శాఖల అధికారులతో బుధవారం సమీక్షించి మాట్లాడారు. జిల్లా లో ఈ నెల 31 నుంచి జూన్ 18 వర కు టైం టేబుల్ ప్రకారం ఉదయం 8:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారన్నారు. జిల్లాలో 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహింనున్నట్లు చెప్పారు. అందులో నాగ ర్కర్నూల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, అచ్చంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కల్వకుర్తి జిల్లా పరి షత్ బాలికల ఉన్నత పాఠశాల, కొల్లాపూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల్లో 540 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. అలాగే ప్ర భుత్వ ఉన్నత పాఠశాల, నాగర్కర్నూల్, గాంధీ మెమోరి యల్ పాఠశాల కొల్లాపూర్, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కల్వకుర్తి, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల అచ్చంపేట 4 కేంద్రాలలో 555 మంది ఇంటర్మీడియేట్ ఓపెన్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలి యజేశారు. ఆయా పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికా రును ఆదేశించారు. అవసరమైన బందోబస్తు, ఆర్ముడ్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించా రు. ప్రశ్నాపత్రాలు ఆయా స్టోరేజ్ కేంద్రాలకు తరలించే సమయంలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాల న్నారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేసే లా సంబంధిత చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీస్ అధి కారులకు సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు నిర్వహించే సమయంలో ఆయా ప్రాంతాల్లోని జిరాక్స్ కేంద్రాలను మూ సివేయించాలన్నారు. జవాబు పత్రాలను సంబంధిత కేం ద్రాలకు పంపేందుకు పోస్టల్ అధికారులు సహకరించాల న్నారు. వేసవి దష్ట్యా ఆయా పరీక్ష కేంద్రాల్లో మెడికల్ సిబ్బ ందిని నియమించాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబా టులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబందించిన సమాచారాన్ని మీడియా పరం గా విద్యార్థులకు తెలిసే విధంగా ప్రచారం చేయాలని జిల్లా పౌర సంబంధాల అధికారికి సూచించారు. జూన్ 21 నుం చి 25 వరకు నాగర్ కర్నూల్ ప్రభుత్వ బాలుర జూని యర్ కళాశాలలో 313 మంది విద్యార్థులకు ఇంటర్మీడియేట్ ఓపెన్ స్కూల్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికా రులను ఆదేశించారు.
సమావేశంలో ఆర్డీఓ నాగలక్ష్మి, జిల్లా విద్యాధి కారి గోవిందరాజులు, డీఎస్పీ దీపక్ చంద్ర, ఏసీ రా జ శేఖ ర్ రావు, కోశాధికారి లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ ఏవో శ్రీని వాసులు, ఓపెన్ స్కూల్ జిల్లా కో-ఆర్డినేటర్ నాగరాజు, వెంకట్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, ఆయా శాఖల అధికా రులు పాల్గొన్నారు.