Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోరుగా ఇసుక అక్రమ రవాణా
- పగలు తుంగభద్ర నదీ పరిసరాల్లో డపింగ్
- రాత్రివేళ ట్రాక్టర్ల ద్వారా తరిలింపు
- మాముళ్ల మత్తులో పట్టించుకోని అధికారులు
- ట్రాక్టర్ ఇసుక రూ.5 వేల నుంచి రూ.6 వేలు
- సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
- ప్రభుత్వ ఆధాయానికి గండి
రాత్రి ఎప్పుడైతుందా అని వారు నిరీక్షిస్తుంటారు.. చీకటి పడిందంటే ట్రాక్టర్లతో నదీ పరివాహక ప్రాంతా ల్లో దాచిన ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటారు.. ఇదంతా అడ్డుకోవా ల్సిన అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.. నది నుంచి ఇసుక అక్రమంగా తరలి పోతున్నా సామాన్యుడికి మాత్రం దొరకడం లేదు.. అదంతా బడా కాంట్రాక్టుల పనులకే తరలి పోతోంది. ఇప్పట్టికైనా అధికారులు స్పందించి ప్రకృతి సంపదను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
నవతెలంగాణ - ఉండవల్లి
మండల పరిధిలోని తుంగభద్ర నది తీరం గ్రామాల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పోలీసులకు, ఎస్సైలకు లక్షల్లో ము డుపులు ఇచ్చుకొని అక్రమార్కులు తమ వ్యాపారం మూడు డంపింగ్లు ఆరు ట్రాక్టర్లుగా కొనసాగిస్తున్నారు. ఉండవెల్లి, మానవపాడు మండలంలోని తుంగభద్ర నదీ తీర గ్రామా లైన కొరివిపాడు, మెన్నిపాడు, పుల్లూరు, కలుగొట్ల, మద్దూరు, గార్లపాడు, అలంపూరు నుంచి అక్రమంగా ఇసు క తరలి పోతోంది. పగలంతా నది నుంచి ఇసుకను తోడి సమీపంలో డపింగ్ చేసుకొని ఆయా మండలాల్లోని ఎస్ఐ లకు ముందస్తు సమాచారం ఇచ్చి తాము పోయే రూట్లలో పెట్రోలింగ్ లేకుండా చేసు కోవడంతో పాటు రాత్రి వేళ రెవెన్యూ అధికారులు ఎవరూ పట్టించుకోక పోవడంతో యథేచ్చగా ఇసుకను తరలిస్తూ ట్రాక్టర్ ఇసుకు రూ.5వేల నుంచి 6వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీం తో ప్రభుత్వానికి వచ్చే ఆధాయానికి గండి కొడుతున్నారు.
మామూళ్లు ఇవ్వని ట్రాక్టర్ల యజమానులను పోలీసు లు టార్గెట్ చేసుకుని అదును చూసి పట్టుకొని కేసు నమో దు చేసి రిమాండ్కు తరలిస్తుండడంతో పోలీసులు ఇసుక అక్రమ దారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారనే పేరు తెచ్చుకుంటునట్లు ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఇసుకకు మంచి డిమాండ్ ఉండడ తో కోట్లలో వ్యాపారం సాగుతోందంటున్నారు.
సామాన్య జనం ఇళ్లు నిర్మించుకుందామంటే ఇసుకు దొరకడం లేదు కాని బడా బడా కాంట్రాక్టర్లు తాము చేపట్టే బ్రిడ్జీ నిర్మాణాలకు, రియల్ వ్యాపారులు చేపట్టే గృహ నిర్మాణాలకు మధ్యవర్తులతో ఒప్పందం చేసుకొని ఇసుకను తెప్పించుకుంటున్నారు.
వాల్టాకు తూట్లు
ప్రకతి సంపదను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వాల్టా చట్టం తెచ్చినా కొందరు అధికారుల వల్ల దానికి తూట్లు పడుతున్నాయి. దీంతో అక్రమార్కులు ప్రకతి సంపదను దోచుకుంటున్నారు. తుంగభద్ర నదిలో ఇసు కను అక్రమంగా తరలిస్తుండడంతో నదిలో గోతులు ఏర్ప డి భూగర్భ జలాలు పడి పోయాయని సమీప రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధి కారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టి ప్రకృతి సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం
- వీరభద్రప్ప, తహసీల్దార్, ఉండవెల్లి
తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమ రవాణాపై ఉండవెల్లి తహసీల్దార్ వీరభద్రప్పను వివరణ కోరగా ఇసుక తరలింపుపై విచరణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని అన్నారు.