Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ పి.ఉదరుకుమార్
- పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించిన అధికారులు
పకడ్బందీగా పరీక్షల నిర్వహణ చేపట్టాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదరుకుమార్, వనపర్తి జిల్లా విద్యాధికారి రవీందర్ అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పది పరీక్షల కేంద్రాలను కలెక్టర్లు, డీఈఓలు బుధవారం పర్యవేక్షించారు. సీసీ కెమె రాల నిఘాలో పరీక్షలు నిర్వహణ సాగేలా చూడాల న్నారు. ప్రశ్నాపత్రాల బండిళ్లను నిర్ణిత సమయానికి తీస్తున్నారా అని అడిగి తెలు సుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
నవతెలంగాణ - కందనూలు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.ఉదరుకుమార్ పర్యవేక్షించారు. పరీక్షల నిర్వహణ పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జి ల్లా వ్యాప్తంగా 62 పరీక్షా కేంద్రాల్లో 11,060 మం ది విద్యార్థులకు గానూ 10,928 మంది విద్యార్థు లు హాజరు కాగా 132 మంది విద్యార్థులు గైర్హాజ రైనట్లు డీఈఓ గోవిందరాజులు తెలిపారు.
ఆత్మకూరు : పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పా ఠశాల, బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షల నిర్వహణ తీరును జిల్లా విద్యాధికారి రవీం దర్ పర్యవేక్షించారు. ఈయన వెంట మండల వి ద్యాధికారి భాస్కర్ సింగ్ తదితరులున్నారు.
తిమ్మాజిపేట : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షల నిర్వ హణ తీరును పరీక్షల సూపరింటెండెంట్ రాఘవ య్య పర్యవేక్షించారు. మండలంలో 216 మందికి గానూ 210 మంది విద్యార్థులు పరీక్షకు హజరు కాగా 6 గురు గైర్హాజరైనట్లు మండల విద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల ఉర్దూ మీడియంలో 146 మందికి గా నూ 139 మంది హజరు కాగా 7 గురు గైర్హాజర య్యారు.