Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనుమరుగౌతున్న ప్రకృతి సంపద
- సారం కోల్పోతున్న భూములు
- తక్కువ ధరకు రైతుల భూములు కొనుగోలు
- పేదలు, గైరాన్ భూములే టార్గెట్
- చక్రం తిప్పుతున్న కంపెనీలు ?
- నష్టపోతున్న సామాన్య రైతులు
- నిబంధనలకు విరుద్ధంగా పనులు
కోట్ల విలువ చేసే నల్లరేగడి భూములను కంపెనీలు తక్కువ ధరకు కొనుగోలు చేసి మట్టిని కొల్లగొడుతు న్నాయి. ప్రాజెక్టుల కోసం సారవంత మైన మట్టిని తరలించడం తో ఆ భూములు భూసారాన్ని కోల్పోయి పంటలు వేసేందుకు వీలు లేకుండా మారుతున్నాయి. నదులు, చెరువులు, కుంటల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మట్టిని తీయాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా కంపెనీ లు అధికార పార్టీ నేతల అండదం డలతో పేదలు, గైరాన్ భూములే లక్ష్యంగా చేసుకుని తక్కువ ధరలకు కొనుగోలు చేసి మట్టిని తరలిస్తున్నారు. పాలకు ల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ధనదాహం వల్ల గ్రామాల్లో పంట భూములు సత్తువను కోల్పోతు న్నాయి. నల్లమట్టి తరలింపు ను ఆపకపోతే సాగు భూములను కోల్పోయే అవకాశాలు న్నాయని, వీటికి తోడు చారిత్రక కట్టడాలు, గుట్టలను కూడా తరలించడంతో పర్యావరణంతో పాటు ప్రకృతి సంపద కనుమరుగౌ తోందని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పా లమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భా గంగా ఆరు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. నార్లపూర్, ఏదుల రిజర్వాయర్లు పూర్తి కాగా ఇంకా వట్టెం, ఉద ండాపూర్, కర్వేనా, లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్లు పూర్తి చేయాల్సి ఉంది. నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ల కో సం నల్లమట్టి అవసరం ఉంది. రిజర్వాయరు కట్ట మధ్యలో నల్లమట్టిని పోయాల్సి ఉంది. కట్ట నుంచి లీకేజీ నివారణకు పగుళ్లు రాకుండా నల్లమట్టిని వా డతారు. నిర్మాణ పనుల్లో భాగంగా ఒప్పంద పత్రా లతో సూచించిన నదులు, చెరువులు, కుంటల నుం చి మట్టిని తీయాల్సి ఉంది. కాంట్రాక్టర్లకు మాత్రం ఇవేవి పట్టడం లేదు. నాగర్కర్నూల్ జిల్లా సమీపం లో మహబూబ్నగర్-శ్రీశైలం వెళ్లే రహదారిలో ఉం డే కేసరి సముద్రం నుంచి ప్రతి రోజు వందల టిప్ప ర్ల నల్లమట్టిని తరలిస్తున్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. సన్న, చిన్న కారు రైతులతో మాట్లాడి తక్కువ ధర చెల్లించి మ ట్టిని తరలిస్తున్నారు. వట్టెం దగ్గర వెంకటాద్రి రిజ ర్వాయరు కోసం తిమ్మాజిపేట మండలం నేరేళ్లపల్లి దగ్గర నల్లమట్టిని గుట్టల మాదిరిగా పోశారు. వేస విలో పోగు చేసి వర్షాకాలంలో వాడుతున్నారు. తా డూరు మండలం మాధారం, ఆవంచ, సిర్సవాడ పాన్గల్ మండలాల పరిధిలో నల్లభూములు అధి కంగా ఉన్నాయి. ఇక్కడ పత్తి, మొక్కజొన్న, వరి, వేరుశనగ పంటలు అధికంగా సాగౌతాయి. మొక్క, వేరుశనగ పంటను తీయగానే మాయి పంట పేరు తో పప్పు శనగ, ఆవాలు, మెంతులు వంటి పంట లు వేస్తారు. నల్లమట్టి భూముల్లో ఏడాదికి రెండు పంటలు సాగు చేస్తారు. ఇంత విలువైన భూముల ను తక్కువ ధరకు నల్లమట్టి విక్రయించి భూముల సత్తువను కోల్పోయేలా చేస్తున్నారు. కేఎన్ఆర్, పీజీ ఆర్, హెచ్ఈసీ వంటి కంపెనీలు ఈ మట్టిని తరలి స్తున్నాయి. నల్లమట్టి మొత్తం తీయడం వల్ల ఆ భూ ముల్లో ఏ పంటలు సాగు కావు. గులకరాళ్లు తేల డం వల్ల భూములన్నీ నిసత్తువగా మారుతాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు అనుమతులివ్వాలని, ఇలా ఇష్టానుసారంగా రైతుల భూములను తక్కువ ధరకు ఖరీదు చేసి మట్టిని తరలిస్తే భూములు సాగుకు పనికి రాకుండా పోతా యని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు తూట్లు !
రిజర్వాయర్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఒప్పందం ప్రకారం నిర్దేశించిన వాగు, నది, చెరువుల నుంచి మట్టిని తరలించాల్సి ఉంది. కానీ అందుకు విరు ద్ధంగా నల్ల భూములు ఎక్క డుంటే అక్కడి నుంచి మట్టిని తరలిస్తూ రైతుల నోట్లో మట్టి కొడు తున్నారు. వారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం తెలియని రైతులు తక్కువ ధరలకు విక్ర యించి మోసపోతు న్నారు. దూరం ప్రాంతంలో ఉన్న నది, చెరువుల నుంచి మట్టిని తీస్తే ఖర్చు ఎక్కువౌతుందని ఈ దోపిడీకి పాల్పడు తున్నారు. అందవల్ల ఉన్న తాధికారులు కాంట్రాక్టర్లు వ్యవహ రిస్తున్న తీరుపై దృష్టి సారించి సారవంతమైన భూ ములను కాపా డాలని రైతు సంఘాల నాయకులు కోరుతు న్నారు.
రైతుల భూములు నాశనం చేయొద్దు
రిజర్వాయర్ల నిర్మాణం చేయడంలో ఎవరి కెలాంటి అభ్యంతరం లేదు. కానీ నిర్మాణాల పేరుతో నాణ్యమైన భూములను నాశనం చేయడం సరికాదు. విలువైన, సారవంతమైన మట్టి తీస్తే అక్కడ పంటలు పండవు. ఏడాదికి రెండు పంటలు తీసే రైతులకు నష్టం వాటి ల్లేలా చేయొద్దు. ఒప్పందం ప్రకారం ఎక్కడ అనుమతి ఉంటే అక్కడి నుంచి మట్టిని తరలి ంచాలి. అలా కాదని నిబంధనలు అతిక్రమిం చి మట్టిని తరలిస్తే ఆందోళనలు చేస్తాం.
- బాల్ రెడ్డి,
రైతుసంఘం జిల్లా అధ్యక్షులు, నాగర్కర్నూల్