Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిమ్మాజీపేట : గ్రామ పంచాయతి కార్మికులకు జూన్ 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పోతురెడ్డిపల్లి గ్రామం లోని గ్రామ పంచాయతి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జీపీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న కార్మికులకు వేతనాలు సరిగ్గా చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సమయానికి వేతనాలు రాకపోవడంతో కార్మికుల కుటుంబాల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అందువల్ల ప్రభుత్వం ప్రతి నెలా 5వ తేదిలోపు వేతనాలు అందించాలన్నారు. ఉద్యోగ భద్రతతో పాటు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వెంటనే అమలు చేయాలన్నారు. కనీస వేతనం రూ.19 వేలు 19000 రూపాయలు చెల్లించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, ఎల్లస్వామి, కృష్ణయ్య, బుచన్న, ఎల్లమ్మ, రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.