Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తెలకపల్లి
కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామాలకు అందిస్తున్న సంక్షేమలను ప్రజలకు చేరువ చేసి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుదామని ఎంపీపీ కొమ్ము మధు అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య సమావేశపు భవనంలో ఎంపీటీసీలు, సర్పంచుల పంచాయతీ కార్యదర్శులకు 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 3 నుండి 18 వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత పల్లె ప్రగతిని జయప్రదం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మోహన్‌బాబు,ఎంపీడీవో చెన్నమ్మ,గ్రామాల ప్రత్యేక అధికారులు, ఎపీటీసీలు ,సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో సిబ్బంది పాల్గొన్నారు.