Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- ఆత్మకూరు
ఆత్మకూరు మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే విద్యార్థి ఇంటర్ నేషనల్ గేమ్స్ లో టార్గెట్ బాల్ లో ఎంపికయ్యాడు. విషయము స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రాం మోహన్ రెడ్డికి గ్రామ, మరియు మండల నాయకులు ,ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవడంతో సహాయం కోరగా తనవంతు సహాయంగా ఆటలు ఆడడానికి వెళ్లడానికి రవాణా చార్జీలు చెల్లిస్తానని నా వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సూచన ప్రకారం ఆత్మకూరు పట్టణంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవి కుమార్ యాదవ్ విమాన ఖర్చులు నిమిత్తం 25 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రాఘవేందర్ ఎంపీటీసీ భీమన్న, తదితరులు పాల్గొన్నారు.