Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరికల్ : నర్సరీ కేంద్రాల్లో పెంచిన మొక్కలను వాడుకోవాలని నారాయణపేట, మక్తల్ ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్ రెడ్డి ,చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మరికల్ మండల కేంద్ర ంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు మంగళవారం ఎంపీపీ శ్రీకళ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు హజరై మాట్లాడుతూ నర్సరీ కేంద్రాల్లో పెంచిన మొక్కలను వాడుకోవాలన్నారు.రైతులకు లేబర్ ఒత్తిడి తగ్గించడానికి వరి కలుపు చనిపోవడానికి అరుదైన పద్ధతులు వ్యవసాయ యంత్ర పరికరాల వస్తున్నా యని గుర్తుచేశారు. మూడు నుంచి ఆరు సంవ త్సరాల పిల్లలకు ఫ్రీ స్కూల్ కార్యక్రమంలో పాటు ఒక్క పూట భోజనం అందించామన్నారు. సమా వేశంలో తెలిపారు. మండలం 17 గ్రామ పంచా యతీలో 2310 ఇంకుడు గుంతలు అనుమతి వచ్చాయన్నారు. దీనికి 1982 పూర్తి చేస్తా మన్నారు. మరికల్ సర్పంచ్ కె గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు.ఎంపీపీ శ్రీకళ జోక్యం చేసుకుని సరైన టైమ్‌కు పనులు పూర్తి చేసి ఉంటే బిల్లులో అవుతాయని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అధికారి ఆర్ ఐ విజరు కుమార్,ఏపీవో చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ అధికారి శివ కుమార్ ,ఎంపీడీవో యశోదమ్మ, ఎం పీ ఓ బాలాజీ, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రెటరీ , జెడ్పీ వైస్ చైర్మన్ సురేఖ అనిమిరెడ్డి, వైస్ ఎంపీపీ రవి కుమార్, సంపత్ కుమార్, కోఆర్డినేట్ సభ్యుడు ఎండి మతిన్, మండలా కేంద్రంలోని గ్రామ సర్పంచులు ,ఉప సర్పం చులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.