Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారాయణపేట టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 69 ద్వారా పేట కోడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టి సాగునీరు ఇవ్వాలని జలసాధన సమితి జిల్లా కో కన్వీనర్ డిమాండ్ చేశారు. మంగళవారం దామరగిద్ద మండల పరిధిలోని మద్దెల బిడు గ్రామంలోఉపాధి హామీ పనులను సందర్శించారు. ఈ సందర్భంగా వద్ద కూలీల ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు ప్రజలకు జరిగే లబ్ధిని వివరించారు. గ్రామంలోని రైతులతో సీఎం కేసీఆర్ కేంద్ర జల శక్తి మంత్రులకు లేఖలు పంపించినట్లు తెలిపారు. ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుందని మరియు త్రాగు నీరు కూడా అందుతుందని అన్నారు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి జిఓ 69 పునరుద్ధరించాలన్నారు.