Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మదనాపురం
నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు వినతి పత్రం అందజేసేందుకు వెళ్లగా అనివార్య కారణాల వల్ల కార్యక్రమంకు రాలేక పోయారని నాజా జాతీయ అధ్యక్షుడు బుద్ధారం మురహరి అన్నారు. టీయూడబ్ల్యూజే ఎచ్ 143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.మారుతిసాగర్కు వినతిపత్రం అందజేశారు.వనపర్తి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీ సన్మాన సభ ప్రథమ మహాసభకు టీయుడబ్ల్యూజే ఎచ్ 143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.మారుతిసాగర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాజా జాతీయ అధ్యక్షుడు బుద్ధారం మురహరి మాట్లాడారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయడంతో పాటు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. చిన్న పత్రికల జర్నలిస్టులను ప్రభుత్వ అధికారులు చిన్నచూపు చూస్తున్నారని, ప్రతి జర్నలిస్ట్ కు హెల్త్ కార్డు ఇవ్వాలన్నారు.కార్యక్రమంలో నాజా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుద్ధారం రవి కుమార్,వనపర్తి జిల్లా అధ్యక్షుడు మందడి చిరంజీవి, అశోక్ కుమార్ రెడ్డి,పెద్దిగారి స్వామి, రాఘవేందర్ గౌడ్,ఎద్దుల శివరాజు, బాజాశేఖర్ ,రవికుమార్, శంకర్, నాగరాజు,మన్నెం సభ్యులు పాల్గొన్నారు.