Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హన్వాడ
కుల వివక్షతను నిర్మూలించాలని డిప్యూటీ తహసీల్దార్ సతీష్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని ఇబ్రహీంబాద్ గ్రామంలో మంగళవారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ తహసీల్దారు సతీష్ కుమార్ ఆర్ఐ కవిత హాజరై మాట్లాడారు. గ్రామాల్లో అంటరానితనం కులవివక్ష ఇంకా కొనసాగుతుందని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతినెల ఒక గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఇబ్రహీంబాద్ గ్రామంలో నేడు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. గ్రామాల్లో రెండు గ్లాసుల విధానము దేవాలయ ప్రవేశం లేకుండా దళితులను చిన్నచూపు చూస్తున్నారని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కుల నిర్మూలన కోసం ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో పెంటయ్య రామయ్య కేశవులు పాల్గొన్నారు.