Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మక్తల్
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో పడమటి ఆంజ నేయస్వామి ఆలయ భూముల వివాదాస్పద అంశాలను నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ పద్మజారాణి మంగళవారం పరిశీలించారు. ఇరు వర్గాల దగ్గర ఉన్న రికార్డులను తీసుకొని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు పడమటి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాయచూర్ హైదరాబాద్ 167 జాతీయ రహదారి పక్కన పడమటి ఆంజనేయస్వామి సర్వే నెంబర్ 35 భూమిలో కొంతమంది స్థలాన్ని ఆక్రమించుకొని భవన నిర్మాణాలు చేయడం తప్పుడు సమాచారం వచ్చింది. ప్రభుత్వ దేవాలయ భూములు కాపాడాలని ప్రభుత్వం కిందిస్థాయి అధికార్లకు చెప్పినవారు స్పందించక పోవడంతో ఆక్రమణదారులు నిర్మాణాలను కొనసాగించడంపై కలెక్టర్ చొరవ తీసుకోవాల ని .స్థానిక ఎమ్మెల్యే చిట్టెంరామ్మోహన్ రెడ్డి అధికార్లను కోరడంతో, మంగళవారం ఆలయ భూములను పరిశీలించారు. పడమటి ఆంజనేయ స్వామి కి రెవెన్యూ రికార్డు ప్రకారం సేత్వార్, బుక్కాఫ్ ఎండోమెంట్ రికార్డు ప్రకారం ఎనిమిది ఎకరాలు హ32.గంటలలో భూమి మారుతి పడమటి ఆంజనేయ స్వామి పేరుమీద పట్టా రికార్డులో ఉంది. కొంతమంది తప్పుడు పత్రాలు సష్టించి ఆలయభూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందులో ఇద్దరు ఓఆర్సి తీకున్నారు. దీనిపై కోర్టుహైకోర్టులో దావావేయగా పరిష్కారం అయ్యేంత వరకు ఆక్రమణ దారులు ఎవరు నిర్మాణాలు చేయరాదని కోర్టు స్టేటస్కో ఇచ్చింది. దీని కొంతమంది అక్రమ కట్టడాలు కోన సాగిస్తున్న వారిపై ఇటివల దార్మిక సమస్థల ఫిర్యాదులపై మంగళవారం నారాయణపేట జిల్లా కలెక్టర్ పద్మజారాణి అంజన్న స్థలాలను పరిశీలించి ఆక్రమ ణదారుల ఎండోమెంట్ వారితో ఉన్న నిర్మాణ పత్రాలను తీసుకోన్నారు. ఈ కార్యక్ర మంలో తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్, ఆలయ ప్రధాన పూజారి ప్రదేశ్ కర్త ఆచార్య, శివ హిందూ పరిషత్. భజరంగ్ దళ్, నాయకులు పాల్గొన్నారు.