Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తకోట : పద్మశీ అవార్డు గ్రహీత, 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యను మండల పరిధిలో పామాపురం గ్రామానికి చెందిన రవాణా శాఖ మంత్రి పీఆర్ఓ వారణాసి సుధాకర్ చారి అభినందించారు. హైదరాబాద్లో మొగులయ్యను కలిసి కిన్నెర గొప్పతనాన్ని, ఆయన జీవితాశయాలను తెలుసుకున్న వారణాసి అంతరించిపోతున్న కిన్నెర వాయిద్యానికి జీవం పోశారని కొనియాడారు. వారసత్వంగా అందిపుచ్చుకోవడమే కాకుండా ఏకంగా '12 మెట్ల కిన్నెర'ను సష్టించిన దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ వరించడం గర్వనీయమన్నారు. తన వాద్యాన్నే ఇంటిపేరుగా మార్చుకొని 'కిన్నెర మొగులయ్య'గా స్థిరపడిన ఆయన కిన్నెరతో రాగాలు పలికించగల అతికొద్ది మందిలో ఒకరుగా నిలిచిపోయారన్నారు. సెభాష్ భీమ్లానాయకా.. అంటూ భీమ్లానాయక్ సినిమా టైటిల్ సాంగ్లో మొగులయ్య తన కిన్నెర వాయిస్తూ పాడిన పాట అందరినీ అలరించిందని గుర్తు చేశారు.