Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-అలంపూర్
దరఖాస్తు ఇచ్చి దండంపెడితే దళిత బంధు రాదని పాలకులను అధికారులను నిలదీసే స్థాయికి దళితులు ఎదగాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాజు ఆన్నారు. మంగళ వారం కేవీపీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో అలంపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం క్రింద 10 లక్షలు ఇవ్వాలని కోరుతూ తహశీల్దార్ ఇంద్రాణికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ దళితులు దరఖాస్తు ఇచ్చి దండంపెడితే దళిత బంధు రాధాని దళిత బంధు వచ్చే వరకు పాలకులను, అధికారులను ప్రశ్నించాలన్నారు. దళిత బంధు పథకం క్రింద మొదటి విడతలో అధికార టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చారని, రెండవ విడతలో అయిన పార్టీలకు అతీతంగా అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం క్రింద లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని రాజకీయ నాయకుల జోక్యం లేకుండా చూడాలని కోరారు. పైరవీలకు, లంచాలకు తావులేకుండా అర్హత కలిగిన ప్రతి నిరుపేద దళిత కుటుంబానికి ఇవ్వాలన్నారు. సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు నరసింహ, రైతు సంఘం జిల్లా కన్వీనర్ ఈదన్న ధర్నాకు మద్దతు తెలిపారు. అంతకు ముందు కెేవీపీఎస్ అలంపూర్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షుడిగా వెంకటస్వామి, మండల ప్రధాన కార్యదర్శి గా నాగరాజు, కమిటీ సభ్యులుగా వెంకటరాముడు, అయ్యప్ప, మౌలాలి, హరిబాబు, మనోహర్, సిద్దయ్య లను ఎన్నుకున్నారు.