Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కందనూలు
బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కల్గించే విధంగా పోగ పీల్చడం చట్టరిత్యా నేరమని, ఇందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిమానా, శిక్షలు విధించే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ పి.ఉదరు కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్క రించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమా వేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వల్ల భారతదేశంలో ప్రతి రోజు 2200 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు. పొగాకు వ్యాపారులు 15 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి విక్రయించకూడదని, విక్రయిస్తే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించేందుకు 2003 సెక్షన్ 6 ను ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చ రించారు. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో పాన్, గుట్కా నమిలి గోడలపై ఉమ్మి వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.ప్రజలకు అవగాహన కల్పించేలా విస్తత ప్రచార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కల్పించేలా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో డీఎంహెచ్ఓ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ ,జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ, డీఆర్డీఎ పీడి నర్సింగ్ రావు, డిప్యూటీ సీఈఓ భాగ్యలక్ష్మి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి కృష్ణా రెడ్డి, లేబర్ అధికారి మహేష్, వైద్య ఆరోగ్య కార్యాలయ అధికారులు శ్రీనివాసులు,ఫసియుద్దీన్, ఇన్స్పెక్టర్, తదితరులు పాల్గొన్నారు.