Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ పట్టణంలో 16 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కతిక సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తడి చెత్త తో బయో గ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఒక్క హైదరాబాద్ నగరంలో మాత్రమే ఉందన్నారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఉంటుందని తెలిపారు. పట్టణంలో ప్రతి రోజు తడి చెత్తను సేకరించి ఈ బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తామన్నారు. ఒక టన్ను తడి చెత్త కు 150 రూపాయల చెల్లిస్తుందని వారు తెలిపారు. ఇలా 40 నుండి 50 టన్నుల తడిచెత్త సేకరించి ఆ సంస్థకు ఇస్తే మహ బూబ్ నగర్ మున్సిపాలిటీ 22 లక్షల రూపాయల ఆదాయం వస్తుందన్నారు. ఇప్పటివరకు చెత్తను ప్రజలు ఎక్కడపడితే అక్కడ చేసేవారని దీన్ని తొలగించడానికి మున్సిపాలిటీ ఖర్చు అయ్యేది అన్నారు. ప్రతి రోజు 2000 సామర్థ్యం గల బయోగ్యాస్ ఉత్పత్తి చేయొచ్చని దీన్ని ఆటోమొబైల్ బస్సులకు అందిస్తామని తెలిపారు. అధికారులు తక్షణమే ఈ ప్లాంట్ కావలసిన రెండు ఎకరాల భూమిని సేకరించాలని ఆదేశించారు. గజానికి ఏడాదికి ఒక రూపాయి చొప్పున ఆ సంస్థ చెల్లిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ నర్సింలు ,కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.