Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్నగర్ : మున్సిపల్ కార్మికుల పర్మనెంట్ కోసం దశల వారిగా పోరాటాలు చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం బాలరాజు అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐటీయూ పోరాటాల వలన అనేక జీవోలు,వేతనాలు పెరిగాయని తెలిపారు. కానీ పెరుగుతున్న ధరలతో పోలిస్తే ఈ వేతనాలు సరిపోవడం లేదన్నారు. కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు వాగ్దానం చేశారని గుర్తుచేశారు. ఆ వాగ్దానాన్ని సాధించుకునేందుకు పోరాటాలకు కార్మికులంతా సిద్ధం కావాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్కు వినతిపత్రం ఇచ్చి సమస్యలపై చర్చించారు. కమిషనర్ స్పందిస్తూ ఎరియర్స్ సగం ఇప్పుడు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి ,పట్టణ కార్యదర్శి చంద్రకాంత్,ఎర్ర నర్సింలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.