Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మహబూబ్ నగర్
కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సీఐటీయూ నాయకులు వీ కురుమూర్తి అన్నారు. మంగళవారం భూత్పూర్ ఎంపీడీవో కార్యాలయం ముందు మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్, డీజిల్, ధరలతో సామాన్యులతో పాటు కార్మికులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు శానిటైజర్, దుస్తువులు, బూట్లు కూడా ఈ కార్మికులకు కనీస ఇవ్వడం లేదన్నారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణ, శ్రీశైలం, కొండన్న తదితరులు పాల్గొన్నారు.