Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక ప్రగతిలో పాలమూరుదే పైచేయి
- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి : ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ప్రభుత్వ సలహాదారుడు అనురాగ్ శర్మ
- అంబరాన్నంటిన రాష్ట్ర అవతరణ వేడుకలు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం ఎనిమిది ఏండ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కతిక సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముందుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్ అండ్ బి అతిథి చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం 2,18,097 లక్షల ఎకరాలు సాగు కాగ నేడు 3.50 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారని తెలిపారు. లక్షన్నర ఎకరాలకు సాగు పెరిగిందన్నారు. రైతు బందు ద్వారా 2,09,607 మంది రైతుల ఖాతాలో 1486 కోట్లు జమ చేశామన్నారు. జీవిత బీమా ద్వారా 2948 మంది రైతులకు రూ.147 కోట్లు విడదుల చేశామన్నారు. జిల్లాలో 751 కోట్ల రుణమాఫి చేశామన్నారు. జిల్లాలో ఉన్న 441 గ్రామపంచాయితీలకు పల్లె ప్రగతి పథకం ద్వారా 36.67 కోట్లతో ట్రాక్టర్లను కొనుగోలు చేశామన్నారు. తెలంగాణ అమరుల కుటుంభాలను ఆయన పరామర్శించి శాలువాలతో సత్కరించారు.ఈ అవతరణ దినోత్సవ వేడుకలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ ,జిల్లా కలెక్టర్ వెంకట్రావు ,ఎస్పీ వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల కలెక్టర్‌ను తేజస్సు నందలాల్ పవర్, సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.