Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెద్దకొత్తపల్లి
డీడీలు కట్టిన రైతులకు ట్రాన్స్ఫార్మర్లు మెటీరియల్ ఇవ్వాలని విద్యుత్ సబ్స్టేషన్ ముందు గురువారం సాతాపూర్ రైతుల నిరసన చేశారు. ఈ సందర్భంగా రైతులు వీరయ్య, లింగస్వామి మాట్లాడుతూ 4 సంవత్సరాల క్రితం వ్యవసాయం కోసం, మామిడి తోటల పెంపకం కోసం డీడీలు చెల్లించామన్నారు. వాటికి కూడా నెంబర్లు వచ్చాయని, కానీ విద్యుత్ అధికారుల తమకు ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ మెటీరియల్ ఇవ్వడంలేదన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. తాము విద్యుత్ సౌకర్యం లేనందున పంటలు వేసి చాలా నష్టపోయామని, నిరసనకు దిగారు. విషయం తెలిసిన విద్యుత్ అధికారి ఏఈ వెంకటేష్ సంఘటనాస్థలానికి చేరుకొని విషయం తెలుసుకొని ఇప్పుడే పై అధికారులతో మాట్లాడానని అతి త్వరలోనే మీకు ట్రాన్స్ఫార్మర్లు,మెటీరియల్ ఇస్తానని హామీ ఇవ్వడంతో విద్యుత్ అధికారులు శాంతించారు. కార్యక్రమంలో శంకరయ్య, నారాయణ ,రాములు ,ఈశ్వరయ్య పాల్గొన్నారు.