Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాది గడిచినా ప్రారంభం కాని పనులు
- దిష్టిబొమ్మలుగా దర్శనమిస్తున్న ఫలకాలు
- స్మృతివనంలో చెట్టు నాటిన అటవీ శాఖ
- మంత్రి మెప్పు కోసమే ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు ?
- ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ మండిపాటు
నవతెలంగాణ - అచ్చంపేట
అచ్చంపేట పట్టణ కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయ సమీపంలో గతేడాది ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురష్క రించుకుని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రూ.1.50 కోట్లతో బతుకమ్మ పండు గల నిర్వహణ కోసం స్మృతివనానికి శంకుస్థాపన చేశా రు. లింగాల రహదారిలోని హైదరాబాద్కు వెళ్లే దారి లో రూ.50 లక్షలతో అంబేద్కర్ విజ్ఞాన భవన నిర్మా ణానికి శంకుస్థాపన చేసి ఏడాదైంది. అలాగే నీటి పా రుదల శాఖ కార్యాలయ ఆవరణలో రూ.4.50 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్బాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇలా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఎలాంటి పనులు చేపట్టలేదు. దీంతో అక్క డక్కడా శిలాఫలకాలు తప్ప అభివృద్ధి పనులు కన్పించడం లేదు. అయితే గత ము న్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం ఎమ్మెల్యే గు వ్వల బాలరాజు ప్రజలను మోసం చేసి అమలుకు యోగ్యం కానీ హామీలతో ఆర్భాటంగా పనులు ప్రార ంభిస్తున్నట్లు గొప్పలు చెప్పు కున్నారనే విమర్శలున్నా యి. ఈ క్రమంలో వారం క్రితం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ వంశీకృష్ణ నాయకులు శిలాఫలకాల వద్ద నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా స్మృతివనంలో బతుకమ్మ సంబు రాలు చేసుకుంటారు. వీటి కోసం ప్రభుత్వం రూ.10 లక్షల దాకా ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఈ స్థలంలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటారు. ఇక ఈ ఏడాది బతుకమ్మ పండుగను ఎక్కడ నిర్వహిస్తారో వేచి చూడాలి. ఇప్పటికైనా పనులు ప్రారంభించి వినియో గంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాప నలు చేసిన నేతలు అభివృద్ధి పనులు ప్రారంభిం చకుండా శిలాఫలకాలతో సరిపెట్టుకు న్నారు. ఏడాదైనా నేటికీ పనులు చేపట్టకపోవడంపై పలువురు మండి పడుతున్నా రు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మంత్రి మెప్పు కోసమే ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారనే చర్చ సాగు తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికైనా పనులు ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.