Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కొత్తకోట
దేవరకద్ర కష్టం తీరేదాకా శ్రమిస్తానని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. స్థానిక సంఘం కార్యాల యంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో చేప ట్టిన భరోసా యాత్రను విజయవంతం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఉచిత విద్య, వైద్యం అందరికి అందించాలనే లక్ష్యంతో తాము చేపట్టిన భరోసా యాత్రకు ప్రతి గ్రామంలో పార్టీలకతీతంగా మంచి స్పందన లభించిందన్నారు. అందరికీ ఉచిత విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేదాకా గడప గడపకు నడుస్తానన్నారు. 21 రోజుల పాటు చేసిన పాదయాత్రలో పాల్గొన్న సహచరులు, మీడియా, పో లీసులకు, కళాకారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు. సమావేశంలో బీసీ మహిళా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు కావలి మధులత, కొత్తకోట మండ లాధ్యక్షుడు అంజన్న యాదవ్, మదనాపురం మండ లాధ్యక్షుడు మహీందర్ నాయుడు, నర్సింహా తదితరు లు పాల్గొన్నారు.