Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఖమర్ఆలీని సంఘం నుంచి బహిష్కరిస్తు నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్ అధ్యతన జరిగిన జిల్లా జనరల్ బాడీ సమావేశంలో కురుమూర్తి మాట్లాడుతూ ఖమర్అలీ సంఘం విధానాలకు వ్యతిరేకంగా, సంఘాన్ని విచ్ఛిన్నం చేయడా నికి పాల్పడుతుండడంతో అతని సంఘం నుంచి బహిష్కరిస్తున్నట్లు జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఆయన తెలిపారు. 2019లో ప్రగతి భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అవుట్సోర్సింగ్, మున్సిపల్ కార్మికు లను పిలిపించుకొని విందు భోజనం పెట్టించి కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని వాగ్దానం చేసి అమలు చేయలేదని అలాంటి అధికార పార్టీ సంఘంలో చేరి ఖమర్అలీ కార్మికులను మోసం చేయడంతో పాటు కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు పాల్పండడంతో ఆయనను సీఐటీయూ నుండి బహిష్కరిస్తున్నట్లు జిల్లా కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. టీిఆర్ఎస్కెవీ పాలకులు సష్టించిన సంఘమని ఆది కార్మిక హక్కులను కాపాడేది కాదన్నారు. కావున కార్మికులు మిత్రులెవరో, నష్టపరిచే వారెవరో ఆలోచించాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కోశా ధికారి చంద్రకాంత్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరద గాలెన్న. తిరుమలయ్య, హమాలీ యూనియన్ జిల్లా నాయకులు గోనెల రాజు, ప్లంబర్ యూనియన్ నాయకులు ముక్తార్ఖాన్. మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు ఎర్ర నర్సింలు, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.