Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యథేచ్ఛగా నకిలీ విత్తనాల దందా
- మారని వ్యాపారుల తీరు
- మామూళ్ల మత్తులో అధికారులు
- తూతూ మంత్రంగా తనిఖీలు
- నష్టపోతున్న రైతన్నలు
- దృష్టి సారించని అధికారులు
దేశానికి అన్నం పెట్టే రైతన్నలను వ్యాపారులు తమ స్వలాభం కోసం నకిలీ విత్తనాలమ్మి నిలువునా ముంచుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాపారులు ప్రతి గ్రామంలో నకిలీ విత్తనాలను డంపు చేసి మరీ అమ్మకాలు చేస్తున్నారు. ఈ తంతు ప్రతి ఏడాది కొనసాగుతూనే ఉంది. అధికారులు కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు, వ్యవసాయాధికారులు ఖరీఫ్ ప్రారంభానికి ముందు వారం పాటు తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టి మమ అనిపించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో నకిలీ పత్తినాల వ్యాపారం చాపకింద నీరులా సాగుతున్నా అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది.
విత్తనం మొదలుకొని రసాయనిక మందుల వాడకం వరకు నకిలీ, కల్తీవే విక్రయిస్తుండడం షరా మామూలైపోయింది. అందుకు అధికారులు వ్యాపారులిచ్చే కాసులకు కక్కుర్తి పడి వ్యాపారులతో పాటు అధికారులూ రైతులను నష్టాల్లోకి నెట్టి తమ వంతు పాత్రను పోషిస్తూ రైతుల పట్ల తమకు ఏపాటి గౌరవముందో నిరూపించుకుంటున్నారు.
నవతెలంగాణ - పదర
నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉమ్మడి అమ్రాబాద్ మండ లంతో పాటు పదర మండలంలో ప్రతి ఏటా దాదాపు 5,600ల హెక్టార్లలో పత్తి పంట సాగవుతుంది. పత్తికి బాగా డిమాండ్ ఉండడం, మండలంలో నల్లరేగడి నేలలు అధికంగా ఉండడంతో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపు తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో గ్రామాలను నకిలీ పత్తి విత్త నాలు ముంచెత్తుతున్నాయి. ప్రతియేటా నకిలీ విత్తనాల వ్యాపారం కోట్లకుపైగా దందా కొనసాగుతుం దంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయిన ప్పటికీ వ్యవసాయ యం త్రాంగం చూసీ చూడ నట్లు వ్యవహరి స్తోంది. పదర మండలంలోని వంకేశ్వరం, చి ట్లంకుంట, చె న్నంపల్లి, ఉడిమి ళ్ల, మారేడు, ఇప్ప లపల్లి, గానుగపెంట, మద్దిమడుగు తదితర గ్రామాలలో నకిలీ బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల విక్రయాలు జోరం దుకున్నాయి.
ఇతర జిల్లాల నుంచి రహస్యంగా కల్తీ విత్తనాలను తీసుకొచ్చి తక్కువ ధరలకు అంటగడుతున్నారు. అనుమతి లేని పత్తి విత్తనాలను చాటు మాటుగా అమ్ముతున్నారు. వీటిని సాగు చేసే సమయంలో కలుపు సమస్య తలెత్తినా గడ్డి మందు చల్లితే పత్తి మొక్క చావకుండా ఉంటుందనే సాకుతో రైతులను నమ్మించి వీటిని కొందరు వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఈ గింజలు మొలిచిన కూడా చెట్టులో ఎదుగుదల ఉండదు. వీటిపై అవగాహన లేని రైతులు భారీగా నష్టపోతున్నారు.
భూత్పూర్ కేంద్రంగా దందా
బీటీ నకిలీ విత్తనాలకు భూత్పూర్ పెట్టింది పేరు. చా లా ఏండ్లుగా భూత్పూరును కేంద్రంగా చేసుకుని వ్యాపారం సాగిస్తు న్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, మాచర్ల నుంచి ఇక్కడికి నకిలీ విత్తనాలు వస్తుం డ డం, వా టిని కొనుగోలు చేసిన రైతులు నష్టపోతున్నారు. నకిలీ విత్త నాలను ఏప్రిల్, మే నెలలోనే గ్రామాలకు చేర్చినట్లు సమాచారం. గ్రామాల్లో ఏజెంట్ల ను ఏర్పాటు చేసుకుని అమ్మకాలు కొనసా గిస్తున్నారు. ప్యాకెట్ రూ.500ల నుంచి రూ.600ల ప్రకారం విక్రయిస్తున్నడంతో ఎక్కువ మంది రైతులు వాటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కంపెనీ విత్తనమైతే ఇలా ఉండాలి
కంపెనీ బీటీ విత్తన ప్యాకెట్లను సులభంగా గుర్తించ వచ్చు. ప్యాకెట్‌పై కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే రింగ్ వస్తుంది. ఒకవేళ రింగ్ కాక పోతే నకిలీ విత్తనంగా గుర్తించవచ్చు. అలాగే కంపెనీ పేరు, అడ్రెస్, వెరైటీ తదితర వివరాలన్నీ ఉండాలి. ఒకవేళ రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు వ్యవసా యాధికారులను సంప్రదించి తగు సూచనలు, సలహాలు తీసుకోవాలి. పత్తి విత్తనాలు కొన్న తర్వాత కూడా వాటిని వ్యవసాయాధికారులకు చూపించి విత్తనం నాటాలి. లేక పోతే రైతులు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది.
అనుమానం వస్తే సమాచారమివ్వండి
కల్తీ విత్తనాలని రైతులకు అనుమానం వస్తే వెంటనే సమాచారం అందించాలి. వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. రైతులు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎరువుల షాపుల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. ఇప్పటి వరకు మండల కేంద్రం లో మూడ్రోజుల పాటు తనిఖీ చేశాము. ఫర్టిలైజర్ షాపుల్లో 21 రకాల విత్తనాలను సేకరించి పరీక్ష నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపాము. భూత్పూర్ నుంచి కొంతమంది రైతులు విత్తనాలు తెస్తున్నట్లు మా దష్టికి వచ్చింది. ఒకవేళ అలాంటి విత్తనాలు కొనుగోలు చేస్తే రైతులు నష్టపోతారు. అధికారుల సూచనల మేరకు విత్తనాలు కొనుగోలు చేయాలి.
- సురేష్‌కుమార్, మండల వ్యవసాయధికారి