Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్లుగా బీటీ రోడ్డుకు నోచుకోని రహదారి
- ఇబ్బందుల మధ్య ప్రయాణికుల ప్రయాణం
- దృష్టి సారించని అధికారులు
- ఆందోళనలో ఆయా గ్రామాల ప్రజలు
నవతెలంగాణ - బాలానగర్
మండలంలోని అగ్రహారం, పొట్లపల్లి నుంచి బోడ జానంపేట వరకు కోటి నిధులతో 6 కిలోమీటర్ల మేర వేయనున్న బీటీ రోడ్డు నిర్మాణ పను లకు 2018లో అప్పటి మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ ఆ రహదారిలో కాంట్రాక్టర్లు మట్టి రోడ్డు వేసి చేతులు దులు పుకున్నారు. బీటీ రోడ్డు వేయక పోవడంతో వాహనదారులు, ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందుల మధ్య ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రస్తు తం వర్షాకాలం కావడంతో వర్షాలు కురిస్తే ఈ రహ దారి గుంతల మయంగా మారి ప్రయాణ కష్టాలు మ రింత దారుణంగా మారనున్నాయని గ్రామస్తులు వా పోతున్నారు.
అందువల్ల పాలకులు, అధికారులు స్పం దించి వెంటనే బీటీ రోడ్డు వేసి రవాణ కష్టాలు తీర్చా లని గ్రామస్తులు కోరుతున్నారు.
బీటీ రోడ్డు నిధులు ఏమయ్యాయి
2018లో ఆర్బాటంగా శంకు స్థాపన చేసిన బీటీ రోడ్డు ని ర్మాణ పనులు నేటికీ చేపట్ట లేదు. ఈ ని ధులు ఏమయ్యా యో అధికారులు, కా ంట్రాక్టర్లు చెప్పాలి. రోడ్డు వేయక పోవ డం వల్ల ఆయా గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందు లు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావ డంతో పరిస్థితులు మరింత దారుణంగా మారే అవ కాశా లున్నాయి. అందువల్ల పాలకులు, అధికారులు వెం టనే బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి.
- యాదయ్య,
రజక సంఘం మండలాధ్యక్షులు, బాలానగర్