Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కందనూలు : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన ఆనంద్ కుమార్ సాగర్ భారతదేశ రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఇటీవల నిర్వహించిన దేశ వ్యాప్త పోటీ పరీక్ష, ఇంటర్వ్యూ లో విజయం సాధించి శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన ఆనంద్. తల్లిదండ్రులు సత్యమ్మ, సుబ్బయ్య దినసరి కూలీలు.ఎలాంటి ఆస్తులు లేకున్నా, ఎవ్వరి సాయం చేయకున్నా, తమ ముగ్గురు పిల్లలను కష్టపడి ఉన్నత చదువులు చదివించారు.ఆనంద్‌కు అన్నలు అజరు కుమార్, అరుణ్ కుమార్. ప్రభుత్వ ఫిజిక్స్ లెక్చరర్‌గా, అరుణ్ కుమార్, ప్రయివేటు విద్యా సంస్థల్లో ఐఐటీ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ పిహెచ్డీ చదువుతున్నారు.ప్రస్తుతం డీఆర్డీఓ, పుణె లో టెక్నికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ 2013లో ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో పీజీ పూర్తిచేసి అప్పటి రాష్ట్ర గవర్నర్ యూనివర్సిటీ గోల్డ్ మోడల్ అందుకున్నారు.ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ సాగర్ మాట్లాడుతూ భవిష్యత్ లో దేశ రక్షణ అవసరాలక నుగుణంగా, ఉన్నతమైన పరిశోధన, సాంకేతిక వ్యవస్థను రూపొం దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలి పారు.సాంకేతిక రంగాల్లో పరిశోధనకు ప్రపంచ స్థాయి లో అత్యున్నతమైన ఆర్గనైజేషన్ గా పేరొం దిన డీ ఆర్డీఓలో పనిచేసేందుకు ఆసక్తి గల యువత అవకాశాన్ని అందిపు చ్చుకోవాలని దేశరక్షణ కోసం మేధా సంపత్తిని చాటి ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశం నుంచి ఆనంద్ నిలి చాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనంద్‌ను అభినందించారు.