Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాన్‌గల్
గ్రామ ప్రథమ పౌరులైన గ్రామ సర్పంచులపై అధికారుల ఒత్తిడి తగ్గించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాల ని సర్పంచుల సంఘం మండలాధ్యక్ష, కార్యదర్శులు భూపాల్ రెడ్డి, వెంకట య్య యాదవ్‌లు అన్నారు. మండల కేంద్రంలోని సంఘం కార్యాలయ ంలో శనివారం నిర్వహించిన సర్పంచుల విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను అన్ని రకాలుగా ఒత్తి డికి గురి చేస్తుందన్నారు. దీంతో ఆశించిన స్థాయిలో ఏ సర్పంచ్ పని చేయలేకపోతున్నారన్నారు. వీటికి తోడు రాజకీయ జోక్యం కారణంగా సర్పంచులు మానసికంగా కృంగిపోతున్నారని వాపోయారు. నాయకుల ఒత్తిడి వల్ల చాలా మంది సర్పంచులు సస్పెండ్‌కు గురౌతున్నారన్నారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల చేయకుండా ఇబ్బం దులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మండ లంలోని జమ్మాపూర్ గ్రామ సర్పంచ్ చిన్నమ్మ చిన్న తీర్మానం చేయలేదని సస్పెండ్ చేయడం సరైందికాదన్నారు. రెండు సంవత్సరాల కిందట గ్రా మాల్లో ఎల్ఈడీ బల్బులు ప్రయివేట్ సంస్థకు ప్రభుత్వం అప్పగించడంతో ఏజెన్సీ నిర్వాహకులు బల్బులు వేయకపోవడంతో గ్రామాలు అంధకార ంలో మగ్గుతున్నాయన్నారు. బల్బులు వేసే పనిని ఏజెన్సీలకు ఇవ్వకుండా సర్పంచులకు ఇవ్వాలన్నారు. సస్పెండ్‌కు గురైన జమ్మాపూర్ సర్పంచ్ చిన్నమ్మకు మళ్లీ బాధ్యతలు అప్పగించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందో ళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఆయా గ్రా మాల సర్పంచులు రంగ నాయక్, దేవ్ సింగ్ నాయక్, శాంతమ్మ తదిత రులు పాల్గొన్నారు.