Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నారాయణపేట టౌన్
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిం చాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ అన్నారు. శనివారం ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులు పేట పట్టణంలోని నర్సిరెడ్డి చౌర స్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ అందించాలన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థ పై ప్రభు త్వాలకు విద్యాశాఖ అధికారులకు, చిత్తశుద్ధి లేదని విమ ర్శించారు. ప్రయివేటు విద్యా సంస్థలలో ఫీజులు నియంత్రించాలని పరిశుద్ధ కార్మికులను నియమించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్ ,జిల్లా సహాయ కార్యదర్శి ప్రవీణ్, నాయకులుశశి,వెంకటేష్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్, నాయకులు మౌనిక,శ్రీను, మారుతి, జ్యోతి, శిరీష, పాల్గొన్నారు.