Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిలిండర్ ధర తగ్గించాలి
- సీపీఐ(ఎం) ,టీఆర్ఎస్, టీడీపీ నాయకులు
- మండలాల్లో రాస్తారోకోలు, ధర్నాలు
నవతెలంగాణ - ఆత్మకూరు
పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సీపీ ఐ(ఎం) జిల్లా నాయకులు ఎస్.రాజు అన్నారు. మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో తహసీల్ధార్ కార్యాలయం ఎదుట శనివారం రాస్తారోకో చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాకమందు రూ. 450 ఉన్న వంట గ్యాస్ ఇప్పుడు 1150 అయ్యిందన్నారు. ఒక సిలిండర్ పై రూ. 700 పెరగడం వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతోందని తెలిపారు. పెట్రోల్ ,డీజిల్, నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. దీంతో బడా పెట్టుబడిదారులు వేల కోట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, లేనిచో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు వెంకట్ రాములు, చెన్నయ్య ,వెంకటేష్ మన్యం,తిరుపతి, విజరు,హమాలీ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్ : పట్టణంలోని గాంధీ చౌరస్తాలో మండల తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండల తెలంగాణ రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ మాట్లా డుతూ సీఎం, ఎమ్మెల్యే ఆదేశాలతో ఈ ధర్నా చేశా మన్నారు.వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆత్మకూరు సింగిల్ విండో సహకారసంఘం చైర్మన్ గాడి కృష్ణమూర్తి, కౌన్సిలర్లు పోషన్న,రామకృష్ణ, నాయకులు అనిల్‌కుమార్ గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి, మాసన్న ,గోపాల్ యాదవ్, రవీందర్, విష్ణువర్ధన్‌రెడ్డి,జానకిరాములు పాల్గొన్నారు.
పెబ్బేరు : పెబ్బేరు పట్టణంలోని సుభాష్ చౌరస్తా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిరసన చేశారు. తెలిపారు.పురపాలక చైర్ పర్సన్ ఎద్దుల కరుణ శ్రీ సాయి మాట్లాడుతూ సామాన్య పేద ప్రజలు వాడే సిలిండర్ ధరలు విపరీతంగా పెంచడం వల్ల ప్రజలపై భారం పడుతోందన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ శ్యామల, మన్యం, డైరెక్టర్లు పురపాలక వైస్‌చైర్మన్ కర్ర స్వామి, కౌన్సిలర్లు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెబ్బేరు : ప్రజలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరల పెంచుతూ ప్రజలపై అధిక భారం మోపుతుందని టీటీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామన్ గౌడ్ విమర్శించారు. శనివారం పెబ్బేర్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం వంట గ్యాస్ మీద 50 పెంచడం వలన ప్రస్తుత గ్యాస్ ధర 1105 రూపాయలకి చేరిందన్నారు. దీనివల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజల మీద భారం పడుతుందని వెంటనే గ్యాస్ ధరల పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
అమరచింత: మండల కేంద్రంలోని బస్టాండు కూడలిలో టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రోడ్డుపై కట్టెల పొయ్యి పై వంట చేస్తూ మున్సిపల్ చైర్ పర్సన్ మంగమ్మ నాగభూషణం గౌడ్, మార్కెట్ చైర్మన్ ఎస్ ఏ రాజు, ఉమ్మడి జిల్లాల టీఆర్ఎస్వి అధ్యక్షులు మరే, డి.నరేష్ రెడ్డి, మండల అధ్యక్షులు రమేష్ ముదిరాజ్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరణి విపరీతంగా పెంచినందుకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నిరసన చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నర్సింలుగౌడ్,టీఆర్ఎస్ మండల కార్యదర్శి వెంకటేష్, ,ఉపాధ్యక్షులు జింక రవి, మహిపాల్,పట్టణ కార్యదర్శి చిన్న బాలరాజు, కౌన్సిలర్ రాజకుమార్, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డీనేటర్ రమేష్ నాయుడు, కోఆప్షన్ సభ్యులు ఏపీ రాజేందర్, షాన్ వాజ్ ఖాన్, రఫీ,ప్రచార కార్యదర్శి ఎండి మహమ్మద్, ఈ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రాజేందర్,టీఆర్ఎస్ పాల్గొన్నారు.
అమరచింత: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో అమరచింత మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో నిరసన నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ శ్యామ్ సుందర్, సీపీఐ(ఎం) మండల నాయకులు ఆర్యన్ రమేష్ ,ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాఘవ, కేవీపీఎస్ మండల నాయ కులు విజరు, సీపీఐ(ఎం) మండల నాయకులునరసింహ బి వెంకటేష్, తిరుపతి, తిరుమలేష్, ప్రకాశం, వెంకీ, మన్సూర్,ఆటో వెంకటేష్ పాల్గొన్నారు.
వెల్డండ : కేంద్ర ప్రభుత్వం ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని, పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని టిఆర్ఎస్ జిల్లా నాయకుడు పోనుగోటి రవీందర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెల్దండ మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రవీందర్ రావ్ మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని అన్నారు. సమావేశంల నాయకులు అర్జున్ ఉన్నారు.