Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి : ఇచ్చిన హామీని అమలు చేయాలని దామరగిద్ద సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గోపాల్ అన్నారు.శనివారం దామరగిద్ద చౌరస్తాలో టెంట్లు వేసుకుని దీక్షలు,అనంతరం ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామ శివారులో గల సర్వే నెంబరు 229లో గల 1024 ఎకరాల భూమిలో సాగు చేసుకుంటున్న రైతులకు తమరు 2018 ఎన్నికల సందర్భంగా పట్టాలు ఇస్తానన్న హామీ నెరవేర్చాలని కోరారు. దామరగిద్ద మండలంలోని కంసాన్పల్లి గ్రామంలో సర్వేనెంబర్ 229లో గల1024 ఎకరాల భూమిలో ఎస్సీ,ఎస్టీ,బీసీ పేద రైతులు బ్రతుకుతున్న విషయం అందరికి తెలుసని గుర్తుచేశారు.భూముల కోసం రైతులు అనేక దశాబ్దాలకు పైబడి రాజకీయ పార్టీల చుట్టూ,ప్రజా ప్రతినిధుల చుట్టూ,ప్రభుత్వ అధికారులకు చుట్టూ తిరిగి ఎంత మొరపెట్టుకున్నా రైతులపై కనికరం లేదన్నారు. ఇప్పటికైనా భూములకు పట్టాలిచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు.లేనిపక్షంలో రైతులతో కలసి ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.