Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మక్తల్
మక్తల్ నియోజకవర్గంలోని 4 ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాల్లో పోలీసులు, న్యాయవాదులు శని వారం కౌన్సిలింగ్ నిర్వహించి ఓ జంటను కలిపారు. ఈ సందర్భంగా మక్తల్ సీఐ సీతయ్య వీటికి సంబం ధించిన వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఫ్యామిలీ కౌన్సిలింగ్‌లు నిర్వహి స్తున్నారు. అందులో భాగంగా 4 సెంటర్లలో 8 పిటిష న్లు వచ్చాయి. వాటిలో ప్రధా నంగా కృష్ణ మండలం లోని ఐనాపురం గ్రామానికి చెందిన మంజుల రాయి చూర్‌కు చెందిన వీరేష్‌కు మూడేండ్ల క్రితం వివాహ మైంది. వారికి ఒక సంతానం. ఐదు నెలల క్రితం భా ర్యాభర్తలు గొడవపడ్డారు. ఈ క్రమంలో భార్య మంజు ల తాళిని తెంచేసి పుట్టింటికి చేరింది. ఇరువురు స్టేష న్కు వెళ్లారు. అక్కడ ఎస్ఐ సూచన మేరకు కౌన్సిలింగ్ కోసం మక్తల్ సర్కిల్ స్టేషన్‌కు పంపారు. దీంతో సీఐ సీతయ్య, ఎస్ఐ రాములు, న్యాయవాది నాగేశ్వరి, మ హిళా పోలీసులు ఇరువురికి పలుమార్లు కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారు. చివరిగా ఇరువురు రాజీపడి అందరి సమక్షంలో మళ్లీ తాళి కట్టి వీరేష్ తన భార్య మంజుల ను ఇంటికి తీసుకెళ్లినట్లు సీఐ తెలిపారు. ప్రతి ఒక్క రూ చిన్న పాటి గొడవలు పడి విడిపోయి తమ జీవి తాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఎవరికైనా కౌన్సి లింగ్ అవసరం అనుకుంటే తమను సంప్రదించాలని, రాజీతో ఇరువురూ గెలిచినట్లేనని తెలియజేశారు.