Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కందనులు : రాష్ర వ్యాప్తంగా మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం 20.లక్షలు అర్థిక సహాయం ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్న లిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రం, ప్రధాన కార్యదర్శి కాలురి శ్రీను డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో జిల్లా కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలపై తెలం గాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాజీలేని పోరాటం నిర్వహిస్తు ందన్నారు. మీడియా స్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కు లను కాపాడేందుకు పోరాటానికి జర్నలిస్టులు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. గత 20నుంచి 30ఏండ్లుగా జర్నలిజంలో పని చేస్తున్న జర్నలిస్టులు నేటికి ఇళ్ళస్థలాలకు నొచు కొలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆస్పత్రిలలో చెల్లు బాటు అయ్యే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం 20.లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ కష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందికొండ మెహాన్, ఉపాధ్యక్షుడు శ్రీదర్, సహాయ కార్యదర్శులు లక్మిపతి, ఎక్బాల్, రవీందర్ రెడ్డి, నరేష్, కోశాధికారి సి.వెంకటేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బాదం పరమేశ్వర్,కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్, తాహెర్, నిరంజన్ గౌడు, సత్యం తదితరులు ఉన్నారు.