Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు చేపట్టాలి
- జిల్లా వీఆర్ఏ జేఏసీ చైర్మన్ ఆర్.విజరు
నవతెలంగాణ- తెలకపల్లి
వీఆర్ఏలకు ప్రభుత్వం వెంటనే పేస్కేల్ అమలుచేస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని నాగర్‌కర్నూల్ జిల్లా వీఆర్ఏ జేఏసీ చైర్మన్ ఆర్ విజ రు, ప్రధాన కార్యదర్శి కె.ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం తెలకపల్లి మండల కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ మండల కమిటీ సమావేశం నిర్వ హించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హతను బట్టి వీఆర్ఏలకు ప్రమోషన్లు, 55 సంవ త్సరాలు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు, కారుణ్య నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20, 21, 22 తేదీల్లో జిల్లా కేంద్రంలో రిలే నిరా హార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. 23న కలెక్ట రట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలి పారు అప్పటికీి ప్రభుత్వం స్పందించకుంటే 25 నుంచి మండల తహసిల్దార్ కార్యాలయాల ముందు సమ్మె నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. అనం తరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. మండల జేఏసీ చైర్మన్‌గా కె.అశోక్, కో చైర్మన్‌గా ఇబ్రహీం, సెక్రటరీ జనరల్‌గా రాము, కో కన్వీనర్‌గా భీముడు, కో కన్వీనర్లుగా సాయి, భాష మౌని సాయిబాబు, సైదులు, కే.బాలమ్మ , చంద్ర య్య, సుల్తాన్, గౌరవ సలహాదారులుగా బాల స్వామి, లింగయ్యలను ఎన్నుకున్నారు. ఈ కార్య క్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కే.అంజనేయులు మండల వీఆర్ఏలు పాల్గొన్నారు.